Homeఎంటర్టైన్మెంట్Sheela Rajkumar: విడాకులు తీసుకున్న మరో హీరోయిన్..!

Sheela Rajkumar: విడాకులు తీసుకున్న మరో హీరోయిన్..!

తాజాగా మరో నటి తన భర్త నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీ షీలా రాజ్ కుమార్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే షీలా రాజ్ కుమార్ విడాకుల వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Sheela Rajkumar: సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో అదే స్పీడ్ గా విడాకులు కూడా అవుతున్నాయి. కొందరు ప్రేమించి పెళ్లిచేసుకున్న నటీ నటులు కలిసి ఉంటున్నప్పటికీ మరికొందరు మాత్రం వివాహం జరిగినా అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని విడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకున్నారు.

తాజాగా మరో నటి తన భర్త నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీ షీలా రాజ్ కుమార్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే షీలా రాజ్ కుమార్ విడాకుల వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వివాహ బంధం నుంచి విడిపోతున్నానన్న షీలా రాజ్ కుమార్ థ్యాంక్స్ అండ్ లవ్ అంటూ భర్త చోళన్ పేరు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న షీలా – చోళన్ లు వీడిపోవడం …షీలా విడాకుల ప్రకటన పోస్ట్ చేయడం వైరల్ గా మారాయి. అయితే షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సమయంలో షీలా, చోళన్ లు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న చోళన్, నటి షీలా రాజ్ కుమార్ తన ప్రేమను బంధంగా మార్చుతూ సముద్రం మధ్యలో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

క్లాసికల్ డాన్సర్ అయిన షీలా రాజ్ కుమార్ 2016వ సంవత్సరంలో పరిశ్రమలో అడుగుపెట్టారు. అరదు చినమ్, నమ్మ విద్యాపిళ్లై వంటి సినిమాల్లో నటించిన ఆమె 2017లో ఆశయ తమిళ దాత్యా అనే సీరియల్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. షీలా ప్రధాన పాత్రలో జీ తమిళ్ లో వచ్చిన ఈ సీరియల్ అప్పటిలో సూపర్ హిట్ గా నిలిచింది. తరువాత ద్రౌపది సినిమాలో నటించిన షీలా మడోన్ అశ్విన్ డైరెక్షన్ లో మండేలా అనే చిత్రంలో నటించారు. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. తరువాత జిగర్తాండ డబుల్ ఎక్స్ లో ఎస్ జే సూర్యకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించారు. దాంతో పాటు బిచ్చగాడు -2 లో విజయ్ ఆంటోనీ చెల్లెలు పాత్రలో షీలా నటించారు.

అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న షీలా ..చోళన్ తో విడిపోవడానికి గల కారణాలు ఏంటనేది తెలియలేదు. అయితే విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper