Pooja Hegde: పూజా హెగ్డే హాట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి సూపర్ గ్లామర్ గా కనిపించారు. పలుచని డ్రెస్లో పరువాలన్నీ చూపిస్తూ మెంటల్ తెప్పించారు ఒంటికి హత్తుకుపోయిన డ్రెస్ ఆమెను ముద్దాడుతున్నట్లుగా ఉండగా… వంపులు సొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏం అందం అంటూ కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.

ఇక వరుస విజయాలతో జోరు చూపించిన పూజాకు హ్యాట్రిక్ ప్లాప్స్ పడ్డాయి. ఆమె హీరోయిన్ గా నటించిన బీస్ట్, రాధే శ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ అయ్యాయి. బీస్ట్ తక్కువ నష్టాలతో బయటపడింది. ఆచార్య, రాధే శ్యామ్ మాత్రం ఆల్ టైం డిజాస్టర్స్ అయ్యాయి. అలాగే జనగణమన మూవీ ఆగిపోవడం పూజాకు మరొక ఎదురు దెబ్బ. విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమన నిర్మాతలు తప్పుకోవడంతో ఆగిపోయింది.
జనగణమన ఆగిపోవడం వలన పూజా హెగ్డేకు రెమ్యూనరేషన్ రూపంలో నాలుగు కోట్లు నష్టం. అయినా పూజా కెరీర్ కి ఢోకా ఏమీ లేదు. పలు భారీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 28లో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో సెకండ్ షెడ్యూల్ కి వెళ్లనుంది. అలాగే బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. అలాగే రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్ టైటిల్ తో మరో చిత్రం చేస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సర్కస్ తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాల్లో ఒకటి విజయం సాధించినా పూజా బాలీవుడ్ లో సెటిల్ కావచ్చు.

కెరీర్ బిగినింగ్ లో సరైన హిట్ లేక ఇబ్బంది పడిన పూజాకు డైరెక్టర్ త్రివిక్రమ్ లైఫ్ ఇచ్చాడు. ఫేడ్ అవుట్ దశలో ఉండగా ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. అక్కడ నుండి ఆమె దశ తిరిగింది. అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ సొంతం చేసుకున్న పూజా వరుసగా భారీ ఆఫర్స్ పట్టేసింది. హరీష్ శంకర్-పవన్ మూవీలో కూడా పూజా నటిస్తున్నట్లు సమాచారం.