Bigg Boss 6 Telugu- Sri Satya: వెంటపడుతున్న అర్జున్ ని వదిలేసి శ్రీసత్య కంటెస్టెంట్ శ్రీహాన్ దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీహాన్ తో ఎక్కువ గడుపుతున్న శ్రీసత్య తీరు కొత్తగా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అర్జున్ ఫోకస్ మొత్తం శ్రీసత్యపై పెట్టాడు. ఎలాగైనా ఆమెను లైన్లో పెట్టి ప్రేమాయణం నడపాలని ట్రై చేస్తున్నాడు. దీని కోసం శిక్షలు ఎదుర్కొన్నాడు. గేమ్ వదిలేసి నాగార్జునతో చివాట్లు తిన్నాడు. చివరకు జైలుపాలు కూడా అయ్యాడు. శ్రీసత్యకు దగ్గరయ్యే క్రమంలో ఆమెకు సేవలు చేశాడు. అయినా శ్రీసత్య కరగలేదు. అర్జున్ తో ఆమె రిలేషన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళలేదు.

శ్రీసత్యకు అర్జున్ ఎంత చేసినా అతని పట్ల ఆమెకు ఆకర్షణ కలగలేదు. హోటల్ టాస్క్ లో శ్రీసత్యను గెలిపించేందుకు తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేశాడు. శ్రీసత్య దాన్ని అర్జున్ చేసిన త్యాగంగా చూడలేదు. సేవలు చేయించుకొని ఇచ్చావు, నాకు ఊరకే ఇవ్వలేదని కొట్టిపారేసింది. ఆరు వారాలు ముగిసినా ఆమెతో అర్జున్ కెమిస్ట్రీ డెవలప్ చేయలేకపోయాడు. దానికి ప్రధాన కారణం.. శ్రీసత్యకు అర్జున్ పట్ల అంత ఇంట్రెస్ట్ లేదు.
కాగా ఆమె శ్రీహాన్ కి దగ్గరవుతుందేమో అనిపిస్తుంది. అర్జున్ తో ఆమె ప్రవర్తనకు శ్రీహాన్ పట్ల ప్రవర్తనకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా రెండు రోజులుగా శ్రీసత్య, శ్రీహాన్ సన్నిహితంగా ఉంటున్నారు. ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. శ్రీసత్య ఫుడ్ తింటూ శ్రీహాన్ ని కవ్వించింది. పరిస్థితులు చూస్తుంటే శ్రీహాన్-శ్రీసత్యల మధ్య కెమిస్ట్రీ డెవలప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కనీసం మరొక వారం వేచి చూడాలి.

గతంలో వీరిద్దరూ కలిసి ఓ పాటకు రొమాంటిక్ స్టెప్స్ వేశారు. శ్రీసత్యను ఎత్తుకొని శ్రీహాన్ గాల్లో తిప్పాడు. అది చూస్తూ అర్జున్ నొచ్చుకున్నాడు. నేను శ్రీసత్యతో డాన్స్ చేస్తుంటే అర్జున్ ఫీల్ అయ్యాడని శ్రీహాన్ మరొక కంటెస్టెంట్ తో చెప్పాడు. కాగా ఒకవేళ శ్రీహాన్-శ్రీసత్యల మధ్య లవ్ పుడితే సిరి పరిస్థితి ఏమిటని కొందరి అభిప్రాయం. శ్రీహాన్ లవర్ సిరి పాపం అన్యాయం అయిపోతుందని అంటున్నారు. శ్రీసత్యతో శ్రీహాన్ రొమాన్స్ చేస్తే సిరి చూసి తట్టుకోలేదేమో అంటున్నారు. గత సీజన్లో సిరి ఫ్రెండ్షిప్ పేరుతో కంటెస్టెంట్ షణ్ముఖ్ తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే.