Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi: 'పెద్ది' కి మరో చిక్కు.. ఇలా అయితే విడుదల అయ్యేది...

Ram Charan Peddi: ‘పెద్ది’ కి మరో చిక్కు.. ఇలా అయితే విడుదల అయ్యేది ఎప్పుడో.. పాపం ఫ్యాన్స్..

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత మూవీ లవర్స్ లో రామ్ చరణ్ సినిమా పై ఆసక్తి కలగడం ఈ చిత్రానికే జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంది […]

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత మూవీ లవర్స్ లో రామ్ చరణ్ సినిమా పై ఆసక్తి కలగడం ఈ చిత్రానికే జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంది మరీ. పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి, విడుదల చేసిన రెండు టీజర్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కానీ మేకర్స్ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. విడుదల తేదీ విషయం లో అభిమానులను అయ్యోమయానికి గురి చేయడమే కాకుండా, ఇతర సినిమాలను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ‘పెద్ది’ ని జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే అది జూన్ 4 న విడుదల చేయబోతున్నారా ?, లేదంటే జూన్ 25 న విడుదల చేయబోతున్నారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిన్న సోషల్ మీడియా లో ఈ చిత్రాన్ని జూన్ 4 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అదే తేదీన కన్నడ సూపర్ స్టార్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘టాక్సిక్’ ని విడుదల చేయబోతున్నట్టు ఆ చిత్ర మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. మరి ఆ తేదీన వేస్తే అనవసరమైన క్లాష్ , థియేటర్స్ పొటెన్షియల్ కి తగ్గ దొరకవు, అంటూ అభిమానులు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే , పెద్ది ని జూన్ 4 న విడుదల చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారట. అది కేవలం టాక్సిక్ చిత్రం వాయిదా పడితేనే ఆ తేదీన ‘పెద్ది’ ని విడుదల చేస్తారట.

లేదంటే జూన్ 25 నే విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. జూన్ 26 న అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే వాళ్ళు రామ్ చరణ్ కోసం ఏప్రిల్ 30 నుండి జూన్ 26 కి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ‘పెద్ది’ జూన్ 25 కి వాయిదా పడుతుంది కాబట్టి, లెనిన్ ని మరోసారి వాయిదా వేస్తారేమో అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ‘లెనిన్’ జూన్ 26 కి తగ్గట్టుగానే ఓటీటీ డీల్ ని కూడా రీసెంట్ గా ముగించారు అట. కాబట్టి ఈ సినిమా ఎట్టి పరిస్థితిలోనూ జూన్ 26 న రాక తప్పదు. అదే కనుక జరిగితే, రెండవ రోజు నుండి ‘పెద్ది’ భారీ స్థాయిలో ‘లెనిన్’ తో థియేటర్స్ ని షేర్ చేసుకోవాల్సి వస్తాది. దాని వల్ల కలెక్షన్స్ కి పెద్ద చిల్లు పడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper