Homeఎంటర్టైన్మెంట్Peddi movie censor talk: 'పెద్ది' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. ఇలాంటి టాక్ వచ్చిందేంటి బాబోయ్..

Peddi movie censor talk: ‘పెద్ది’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. ఇలాంటి టాక్ వచ్చిందేంటి బాబోయ్..

Peddi movie censor talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి సరైన సూపర్ హిట్ లేక తీవ్రమైన కరువులో ఉంది. బయ్యర్స్ చేతుల్లో ఒక్క పైసా కూడా రొటేషన్ కోసం లేవు, ఇలాంటి సమయం లో థియేటర్స్ మరోసారి కళకళలాడుతూ , కాసుల కనకవర్షం కురవాలంటే కచ్చితంగా ‘పెద్ది’ చిత్రం వల్లే అది సాధ్యం అవుతుందని బలంగా నమ్ముతున్నారు […]

Peddi movie censor talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి సరైన సూపర్ హిట్ లేక తీవ్రమైన కరువులో ఉంది. బయ్యర్స్ చేతుల్లో ఒక్క పైసా కూడా రొటేషన్ కోసం లేవు, ఇలాంటి సమయం లో థియేటర్స్ మరోసారి కళకళలాడుతూ , కాసుల కనకవర్షం కురవాలంటే కచ్చితంగా ‘పెద్ది’ చిత్రం వల్లే అది సాధ్యం అవుతుందని బలంగా నమ్ముతున్నారు బయ్యర్స్. దానికి తోడు మేకర్స్ కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో అసలు ఎక్కడా తగ్గడం లేదు. వరుస పెట్టి ఇంటర్వ్యూస్ ఒక పక్క చేస్తూనే, మరో పక్క ఈవెంట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్ గానే ముంబై లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యింది.

ఈ ఈవెంట్ ద్వారా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చాలా డల్ గా ఉన్నట్టు ఉంది , ఇలా అయితే ఈ చిత్రం సక్సెస్ అవ్వడం చాలా కష్టమని అనుకున్నారు , కానీ నేడే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు చెప్పిన టాక్ ని చూస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తారు. సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు , ఒక్క సన్నివేశం కూడా బోర్ కొట్టాడట. ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో , గూస్ బంప్స్ మూమెంట్స్ తో ఈ సినిమాని నింపేసాడట డైరెక్టర్ బుచ్చి బాబు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చివరి 45 నిమిషాలు రామ్ చరణ్ నటనకు ఏడవని మనిషంటూ ఎవ్వరూ ఉండరట. ఆ రేంజ్ లో జీవించాడని టాక్. అదే విధంగా పాటలు వినేందుకు ఎంత వినసొంపుగా ఉన్నాయో , సినిమాలో కూడా అంతే అందంగా చిత్రీకరించారట.

ఈ చిత్రం లో రామ్ చరణ్ నటనతో పాటు, జగపతి బాబు నటన కూడా బాగా హైలైట్ అయ్యిందని, ఫస్ట్ హాఫ్ కే ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ని జారీ చేశారు. సినిమా నిడివి 3 గంటల 2 నిమిషాలు ఉంటుందట. పెద్దగా కట్స్ ఏమి చెప్పలేదట కానీ , కొన్ని డైలాగ్స్ కి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారట సెన్సార్ సభ్యులు. వాటిని మ్యూట్ చేసినట్టు సమాచారం. ఓవరాల్ గా టాలీవుడ్ లో ఏర్పడిన నాలుగు నెలల కరువుని ఈ సినిమా తీర్చబోతుందని, రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ ని మించిన సినిమా గా నిలుస్తుందని అంటున్నారు. ఆ స్థాయి సినిమా ఐటితే కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ ని రాబట్టగలదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper