Honda ZR-V premium SUV launch: ప్రీమియం కార్లు కొనాలని చూసేవారికి Honda కంపెనీ అనుకూలంగా ఉంటుంది. వీరి కోసం లేటెస్ట్గా కొత్త కారును తీసుకురాబోతుంది.. ఇప్పటికే దీని గురించి పరిచయం చేసిన కంపెనీ మొత్తానికి మరో రెండు రోజుల తర్వాత కారును ప్రవేశపెట్టనుంది. ఈ కారులో మెరుగైన పర్ఫామెన్స్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉన్నట్లు ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది. అయితే దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Honda ZR-V కారులో ప్రధానంగా 2.0 లీటర్ e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉండనుంది. ఇది పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సుమారు 181 bhp పవర్, 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీవేగాన్ని అందుకోగల సామర్థ్యం దీని సొంతం. అంతేకాకుండా, ఇందులో ఉన్న e-CVT గేర్‌బాక్స్ వల్ల ప్రయాణం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది ఎకానమీ (Econ), నార్మల్, స్నో, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్‌తో వస్తోంది.
ఈ SUV కారు స్పోర్టీ లుక్‌తో పాటు ప్రీమియం ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా హోండా యొక్క ‘Sensing’ (ADAS) టెక్నాలజీ, 8 నుండి 11 వరకు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటివి ప్రయాణీకులకు పూర్తి రక్షణ కల్పిస్తాయి.
హోండా ZR-V ని పూర్తిస్థాయిలో విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నందున, దీని ధర కొంచెం ప్రీమియంగా ఉండబోతోంది. మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.40 లక్షల నుండి రూ. 55 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది భారత మార్కెట్లో Skoda Kodiaq, Volkswagen Tiguan వంటి లగ్జరీ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ముఖ్యంగా మైలేజీ విషయంలో కూడా ఇది లీటరుకు సుమారు 22 నుంచి 25 కి.మీ వరకు ఇచ్చే అవకాశం ఉండటంతో, ప్రీమియం సెగ్మెంట్లో పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
