Payal Rajput: హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్ కి పేరు వచ్చిందే అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శన చేయడం ద్వారా. అసలు ఈ మధ్య కాలంలో బోల్డ్ యాక్టింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాయల్ నే. అంతగా పాయల్ అందాల ప్రదర్శనలో గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి “ఆర్ ఎక్స్ 100” అనే చిన్న సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు అంటే.. అందుకు కారణం పాయల్ అంగాంగ ప్రదర్శనే.

బయటకు వదలిన పోస్టర్స్ చూసే.. మిగిలిన సినిమాల మేకర్స్ షాక్ అయ్యారు. ఎవరు ఈ హీరోయిన్ ? ఈ స్థాయిలో స్కిన్ షో చేస్తుంది ? ముఖ్యంగా ముద్దు సీన్లు, బెడ్ రూమ్ సీన్ల విషయంలో తిరుగులేకుండా నటిస్తోంది ? ఎవరీమె ? అంటూ పాయల్ గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకునేంతగా పాయల్ రెచ్చిపోయింది. పైగా మొదటి సినిమాకే.
ఇక సినిమాల్లో అనుభవం వచ్చాక, తన అందాలతో కిరాక్ పుట్టించింది. సోలో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. ఐతే, పాయల్ ఎంతగా అందాలతో కనువిందు చేసినా కాలం కలిసి రాలేదు. ఆమెకు మళ్ళీ చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. ఎన్ని సినిమాలు చేసినా ఆమెకి కనీసం ఒక్క విజయం కూడా దక్కలేదు. దాంతో సహజంగా అవకాశాలు తగ్గాయి.

సినిమా ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ ల వెంట పడుతుంది. ఎలాగూ పాయల్ కు సక్సెస్ లేదు కాబట్టి.. ఆమెను పెట్టారు. “వెంకీమామ”, “డిస్కోరాజా” వంటి రెగ్యులర్ సినిమాల్లో కమర్షియల్ పాత్రలు చేసినా.. పాయల్ కి అసలు ఉపయోగపడలేదు. మొత్తమ్మీద పాయల్ కెరీర్ కి ఇప్పుడు ఓ పెద్ద ఊపు రావాలి. అవకాశాలు పెరగాలి. ఎలాగూ స్టార్ హీరోల చిత్రాలు వచ్చేలా లేవు.
Also Read: Ajay Bhupathi: ఫ్యాన్స్ కు ట్విట్టర్ వేదికగా క్షమాపనలు చెప్పిన … డైరెక్టర్ అజయ్ భూపతి
కనీసం చిన్న సినిమాలు కూడా రాకపోతే ఎలా ? అందుకే, తనకు అలవాటు ఉన్న స్కిన్ షోనే మళ్ళీ నమ్ముకుంది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న “తీస్ మార్ ఖాన్” అనే సినిమాలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో పాయల్ సోయగాల వలపులు విచ్చలవిడిగా ఉండబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన స్టిల్స్ చూస్తేనే పాయల్ తన గ్లామరసం భారీగా ఒలకబోసింది.
Also Read: Bheemla Nayak: ” భీమ్లా నాయక్ ” లో రానాకి జతగా సంయుక్త మీనన్… అఫిషియల్ అనౌన్స్ మెంట్