Ajay Bhupathi: యంగ్ హీరో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ” మహా సముద్రం “. ఆర్‌ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అజయ్ రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ లో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు తమ అసంతృప్తిని సోషల్‌మీడియా ద్వారా డైరెక్టర్ భూపతికి వ్యక్తం చేశారు.
ఈ నేపధ్యంలో పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూకి సంబంధించి పోస్ట్ లు పెడుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా పవన్‌రెడ్డి అనే అభిమాని ట్విట్టర్ ” మహాసముద్రం ఏంటి అన్నా అలా తీశావ్… చాలా ఎక్స్‌పెక్ట్ చేశా అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అజయ్‌భూపతి మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్ట్స్ టైం మంచి కథతో వస్తాను అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం అజయ్ భూపతి చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Sorry for not reaching your expectations… Next time I will be back with a story that can satisfy you all… https://t.co/RTWin30gKV
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021
చిత్రంలో రావు రమేశ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించగా … చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇద్దరు స్నేహితులు భిన్న మనస్తత్వాలు కలిగిన వారు పరిస్థితుల ప్రభావం వల్ల ఎలా మారారు. అలానే వారి ప్రేమను వారు గెలిపించుకోగలిగారా… వారికి అడ్డొచ్చిన సమస్యలు ఏంటి అనే కధాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మంచి కధను ఎంచుకున్న అజయ్ … దాన్ని ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడని చెప్పాలి. మరి నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తాడో … లేదో చూడాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ajay bhupathi apologies to fans on twitter for maha samudram movie failure
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com