Homeఎంటర్టైన్మెంట్OG 2 Update: 'ఓజీ 2' లో ఇంత మంది హీరోలు ఉండబోతున్నారా.. పవన్ ఫ్యాన్స్...

OG 2 Update: ‘ఓజీ 2’ లో ఇంత మంది హీరోలు ఉండబోతున్నారా.. పవన్ ఫ్యాన్స్ కి మరో మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వనున్న సుజిత్..

OG 2 Update: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ఒక మైలురాయి లాంటి చిత్రం ‘ఓజీ'(They Call Him OG). సరైన సమయం లో సరైన సినిమా పడడంతో నేటి తరం జెన్ జీ యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ లో అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు IPL సీజన్ నడుస్తోంది , ఎక్కడ చూసినా ఓజీ సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకొని క్రికెట్ అభిమానులు ఏ రేంజ్ లో ఎడిటింగ్స్ […]

OG 2 Update: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ఒక మైలురాయి లాంటి చిత్రం ‘ఓజీ'(They Call Him OG). సరైన సమయం లో సరైన సినిమా పడడంతో నేటి తరం జెన్ జీ యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ లో అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు IPL సీజన్ నడుస్తోంది , ఎక్కడ చూసినా ఓజీ సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకొని క్రికెట్ అభిమానులు ఏ రేంజ్ లో ఎడిటింగ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఎలివేషన్ బ్లాక్స్ , అభిమానులు జీవితాంతం గుర్తించుకుంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటి భాగం లోనే క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం లో ‘ఓజీ 2’ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని చూపిస్తాడు డైరెక్టర్ సుజిత్.

‘ఓజీ’ అనేది ఒక పెద్ద యూనివర్స్, ఇప్పట్లో ఈ సినిమా ఫ్రాంచైజ్ ఆగదు , త్వరలోనే ఓజీ కి ప్రీక్వెల్ , సీక్వెల్ కూడా ఉంటుందని సుజిత్ ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రెండు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఓజీ తర్వాత విడుదలైన ఈ చిత్రాన్ని ఈ రేంజ్ ఫలితం రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అభిమానులను సంతృప్తి పరచడం కోసం త్వరలోనే ‘ఓజీ 2’ మొదలు అవుతుందని ఒక హింట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని పూర్తి చేశాడట డైరెక్టర్ సుజిత్. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే భారీ ఈవెంట్ ఫిల్మ్ గా తీర్చి దిద్దాలని కసితో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్.

అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాడు. ముందుగా ఓజీ ప్రీక్వెల్ ని ప్రారంబిస్తారట. ‘ఓజీ’ మొదటి భాగం క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ కూతురు ‘ఓజీ’ అంటే ఏంటి నాన్న అని అడుగుతుంది గుర్తుందా ?, అక్కడి నుండి ఓజీ ప్రీక్వెల్ మొదలు అవుతుందట. ప్రీక్వెల్ లో ఓజాస్ గంభీర తండ్రి ఆజాద్ బ్యాక్ స్టోరీ ని చూపిస్తాడు. ఆజాద్ కి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణ స్నేహితుడు. ఆ పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నట్టు సమాచారం. ‘ఓజీ’ లోని మధురై పోలీస్ స్టేషన్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ బ్యాగ్ ని పోలీసులు చెక్ చేయగా, అందులో సుభాష్ చంద్రబోస్ గెటప్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు గుర్తుందా?, అంటే ప్రీక్వెల్ లో కచ్చితంగా రామ్ చరణ్ ఉంటాడు అన్నమాట. అదే విధంగా సత్య దాదా తో సాహూ తండ్రి కి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. అంటే ‘ఓజీ’ ప్రీక్వెల్ క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ కూడా ఉంటుందని సమాచారం. ఇక ఓజీ సీక్వెల్ లో అయితే ప్రభాస్ , నాని కూడా ఉంటారట. ఇలా ‘ఓజీ’ ఫ్రాంచైజ్ ని ఇండియా లోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా తీర్చి దిద్దబోతున్నాడు సుజిత్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper