Homeఎంటర్టైన్మెంట్Dacoit Collections: సోమవారం టెస్ట్ లో డిస్టింక్షన్ లో పాస్ అయిన 'డెకాయిట్'.. ఎంత గ్రాస్...

Dacoit Collections: సోమవారం టెస్ట్ లో డిస్టింక్షన్ లో పాస్ అయిన ‘డెకాయిట్’.. ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Dacoit Collections: అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie) విడుదలైన మొదటి ఆట నుండే డీసెంట్ టాక్ ని సొంతం చేసుకొని , మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం , థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి మొదటి మూడు రోజుల్లోనే రీకవరీ మార్కుని అందుకుంది. ఇప్పుడు కేవలం ఈ సినిమాని కొన్న బయ్యర్స్ […]

Dacoit Collections: అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie) విడుదలైన మొదటి ఆట నుండే డీసెంట్ టాక్ ని సొంతం చేసుకొని , మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం , థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి మొదటి మూడు రోజుల్లోనే రీకవరీ మార్కుని అందుకుంది. ఇప్పుడు కేవలం ఈ సినిమాని కొన్న బయ్యర్స్ మాత్రమే బ్రేక్ ఈవెన్ మార్కుని పొందాలి. వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ భారీ లెవెల్ లో డ్రాప్ అయిపొతుందెమో అని అంతా అనుకున్నారు. కానీ మొదటి సోమవారం రోజున అద్భుతమైన హోల్డ్ ని సాధించి, బలమైన లాంగ్ రన్ ని సూచించింది ఈ చిత్రం. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి నిన్న 53 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ఇక ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి నాల్గవ రోజున కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 1 కోటి 66 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది ఈ చిత్రం. గ్రాస్ అయితే దాదాపుగా 3 కోట్ల 40 లక్షల రూపాయిల వరకు వచ్చిందట. వర్కింగ్ డే లో ఈ రేంజ్ వసూళ్లు నమోదు అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా 4 రోజుల్లో ఈ చిత్రం 62 శాతం రీకవరీ ని సొంతం చేసుకుంది. ప్రాంతాల వారీగా నాలుగు రోజుల్లో వచ్చిన షేర్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 5 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా ఆంధ్ర ప్రాంతం నుండి నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి 3 కోట్ల 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , సీడెడ్ ప్రాంతం నుండి 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని ప్రాంతాల్లో డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి కానీ, సీడెడ్ నుండి మాత్రం డిజాస్టర్ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. ఓవరాల్ గా మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 16 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 9 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, హిందీ నుండి 2 కోట్ల 80 లక్షలు, ఓవర్సీస్ నుండి 5 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 రోజుల్లో 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 19 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం 11 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే రావాలి , ఈ వీకెండ్ తో ఆ మార్కుని ఈ చిత్రం కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper