NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొద్దిగా డీలా పడ్డాడు. ముఖ్యంగా పాన్ ఇండియాలో ఆయన మార్కెట్ ను విస్తరించుకోవడంలో చాలావరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి… కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ హిట్స్ ని సాధించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరోలతో పోటీ పడడంలో మాత్రం కొంతవరకు వెనకబడిపోతున్నాడు. కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇకమీదట నుంచి తను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో ఆయన చేసిన ఒక సినిమా సూపర్ సక్సెస్ అయి ఉంటే ఆయనను ఆపడం ఎవరివల్ల అయి ఉండేది కాదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘ఆంధ్రావాలా ‘ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ఈ సినిమాకి ఉన్న హైప్ ఏ సినిమాకి లేదు.
అలాగే ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కనుక ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా మారే అవకాశం ఉండేదని చాలామంది సినిమా మేధావులు సైతం ఇప్పటికి కొనియాడుతూ ఉంటారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా వల్ల చాలా వరకు నష్టపోయాడు. ఈ సినిమా నుంచి అతని ప్లాపు ల పరంపర కొనసాగుతూనే వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఒక సక్సెస్ కూడా లేకపోవడంతో ఆయన ఇతర హీరోల కంటే కూడా డౌన్ అయిపోయాడు.
ఇక ఆ తర్వాత రాజమౌళితో చేసిన ‘యమదొంగ’ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే చాలా హై చూశాడు. కానీ ఇప్పుడు తను కొంతవరకు డౌన్ అయిపోవడం చూస్తున్నా అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు…
