Nara Rohit : మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకైన నారా రోహిత్ 2009లో నటుడిగా అరంగేట్రం చేశాడు. బాణం ఆయన డెబ్యూ మూవీ. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన సోలో మూవీతో హిట్ కొట్టాడు. తర్వాత చాలా ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు. 2018లో బ్రేక్ తీసుకున్నాడు. ఆయన చివరి చిత్రం వీరభోగ వసంతరాయలు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మూవీ ప్రకటించారు. నారా రోహిత్ 19వ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.