Venkatesh-Aishwarya Rai : విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్, మాస్, ఫ్యామిలీ డ్రామా, యూత్ ఫుల్ ఎంటర్టైనర్, ఇలా అన్ని జానర్స్ లో భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న ఏకైక హీరో ఆయన మాత్రమే. అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇసుమంత ఆదరణ కూడా తగ్గలేదు. ఆయన రీసెంట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇకపోతే వెంకటేష్ కెరీర్ లో యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘ప్రేమించుకుందాం రా'(Preminchukundam raa). జయంత్ సి పరాన్జీ(Jayanth C Paranji) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సంచలనం. ఈ చిత్రం ద్వారానే అంజలా జవేరి హీరోయిన్ గా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది.
Also Read : హీరోయిన్ సమంత కి గుడి కట్టిన వీరాభిమాని..వైరల్ అవుతున్న వీడియో!
ఈ చిత్రంలోని అనేక సన్నివేశాలు అప్పట్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసాయి. యూత్ ఆడియన్స్ వాటిని అనుసరించేవాళ్ళు కూడా. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన జయంత్ సి పరాన్జీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం తాలూకు అనుభవాలను కొన్ని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ముందుగా నేను ఐశ్వర్య రాయి(Aishwarya Rai) ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాను. అప్పుడే ఆ అమ్మాయి ఇండస్ట్రీ లోకి వచ్చింది. నా బంధువుల ద్వారా ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు కూడా. ఈ సినిమాకు ఐశ్వర్య రాయి అయితే చాలా బాగుంటుంది అని మూవీ టీం తో చెప్పాను. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. కారణమ్ ఐశ్వర్య రాయి అప్పట్లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని ఉంది. ఆమెని తీసుకుంటే ఫ్లాప్ హీరోయిన్ నటిస్తున్న సినిమా అనే ముద్ర పడుతుందని వద్దు అన్నారు’.
‘కానీ ఈ సినిమా విడుదలైన కొన్నాళ్ళకు ఐశ్వర్య రాయి బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. నేను నాగార్జున గారితో అప్పట్లో చేస్తున్న ‘రావోయి చందమామ’ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఆ క్రమంలో ముంబై కి వెళ్ళినప్పుడు ఐశ్వర్య రాయ్ ని కలిసాను. ఇలా స్పెషల్ సాంగ్ ఉంది, ఇందులో ప్రీతి జింటా ని అడుగుదామని అనుకుంటున్నాను అనే విషయాన్నీ చెప్పాను. అప్పుడు ఐశ్వర్య రాయి మీరు అందరి దగ్గరకు వెళ్తున్నారు, కానీ నాతో ఎందుకు సినిమా చేయడం లేదు అని అడిగింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాటనే మీరు చేస్తారా అని అడిగాను, ఆమె వెంటనే ఒప్పుకొని చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె తెలుగులో కనిపించిన మొదటి సినిమా, చివరి సినిమా కూడా అదే అవ్వడం విశేషం.
Also Read : తమన్నా తో బ్రేకప్ గురించి మొదటిసారి స్పందించిన విజయ్ వర్మ!