spot_img
Homeఎంటర్టైన్మెంట్Nani: మహేష్ బాబుకు అది కరెక్ట్ అయితే నాకు ఇది కరెక్ట్... సూపర్ స్టార్ పై...

Nani: మహేష్ బాబుకు అది కరెక్ట్ అయితే నాకు ఇది కరెక్ట్… సూపర్ స్టార్ పై నాని కామెంట్స్ కి అందరూ షాక్

Nani: హీరో నాని వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఆయన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దసరా నాని కెరీర్ హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. నానికి జంటగా కీర్తి సురేష్ నటించింది. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. హాయ్ నాన్న మూవీతో మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద స్లోగా పుంజుకున్న హాయ్ నాన్న, బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది.

నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం విడుదలకు సిద్ధం అవుతుంది. ఆగస్టు 29న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబోలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికీ వచ్చింది. ఈ మూవీ ఫలితం నిరాశపరిచింది. అయితే వివేక్ ఆత్రేయ టాలెంట్ పై నమ్మకంతో నాని ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో మహేష్ బాబుపై నాని కీలక కామెంట్స్ చేశాడు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో నాని పాల్గొన్నాడు. మహేష్ బాబు వంటి హీరో ఓ పర్ఫెక్ట్ ఫిల్మ్ తో పాన్ ఇండియా డెబ్యూ ఇవ్వాలని ఎదురు చూశారు. రాజమౌళితో చేయబోతున్న చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. కానీ నాని మాత్రం ప్రతి సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు? ఎవరి స్ట్రాటజీ కరెక్ట్? అని హీరో నానిని యాంకర్ అడిగాడు.

ఈ ప్రశ్నకు సమాధానంగా నాని… మహేష్ బాబు వస్తూనే సూపర్ స్టార్. ఆయన జర్నీ వేరు. ఒక పర్ఫెక్ట్ భారీ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆయన ఆలోచన కరెక్ట్. అదే సమయంలో నా స్ట్రాటజీ కూడా కరెక్ట్. ఎందుకంటే నా జర్నీ వేరు. నేను సినిమా సినిమాకు నా ఆడియన్స్ ని పెంచుకుంటూ పోవాలని అనుకుంటున్నాను. ఇతర భాషలే కాదు, తెలుగులో కూడా నేను అదే చేశాను.

నేను హీరోగా వచ్చినప్పుడు నాని ఎవరో ఆడియన్స్ కి తెలియదు. మహేష్ బాబుకి ఆల్రెడీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ నాకు లేదు. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ లో కూడా నేను ఒక్కో సినిమాతో నా ఆడియన్స్ సంఖ్య పెంచుకుంటూ పోవాలి అనుకుంటున్నాను. కాబట్టి మహేష్ బాబుకు ఆయన స్ట్రాటజీ కరెక్ట్ అయితే, నాకు ఈ విధానం సూట్ అవుతుందని నేను భావిస్తున్నాను, అన్నారు. నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

Most Popular

Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Oktelugu Epaper