Nani: డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోగా మారి వరుసగా హిట్టు సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్న హీరోలో నాని ఒకరు. ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈయన చేసిన దసరా సినిమా అయితే ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి నాని సినిమాల్లో మొదటి వంద కోట్లు సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సమయంలో నాని కొత్త దర్శకుడు అయిన శౌర్యువ్ తో నాని 30 వ సినిమా గా హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా లో నానికి జోడిగా మృణల్ ఠాకుర్ నటిస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న నాని ఈ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ నానితో మీ వరుస సినిమాల్లో లిప్ కిస్ లు ఉంటున్నాయి ఏంటి మీరే కావాలని డైరెక్టర్లతో చెప్పి పెట్టిస్తున్నారా? లేదా డైరెక్టర్లే కావాలని పెడుతున్నారా అని అడిగాడు. దాంతో నాని దానికి సమాధానం ఇస్తూ అన్ని సినిమాలు కాదు నేను చేసిన ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే లిప్ లాక్ లు పెట్టడం జరిగింది.
ఒక నటుడిగా డైరెక్టర్ ఏదైతే కోరుకుంటాడో అది ఇవ్వడంలో నేను 100% సక్సెస్ అవ్వాలి. ఈ లిప్ లాక్ లు అనేవి నేను డిమాండ్ చేయడం వల్ల కాదు ఆ పట్టిక్యులర్ టైం కి దర్శకుడు రాసుకొని స్టోరీ లో సీన్ డిమాండ్ చేయడం వల్ల ఇలాంటి సీన్స్ ఉంటాయి కానీ అవన్నీ కావాలని ఎవరు చేయరు సార్ అంటూ సమాధానం ఇచ్చాడు.ఇక అలాగే ఇలాంటి సీన్స్ చేసినపుడు మా ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు మా మధ్య కూడా తరచుగా గొడవలు అవుతూ ఉంటాయి.టీజర్ ఇప్పుడే కదా రిలీజ్ అయింది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి అంటూ సరదాగా అందరిని నవ్వించాడు నాని…
అయితే కొంతమంది నాని ఫ్యాన్స్ మాత్రం నాని ఇలాంటి లిప్ కిస్ లు పెట్టడం బాగాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నాని అంటే ఒక డీసెంట్ కుర్రాడిలానే ఉండాలి అని వాళ్ళు అంటున్నారు.ఇక మరికొందరు మాత్రం ఒక నటుడి గా చేసినప్పుడు సీన్ డిమాండ్ చేస్తే అన్ని చేయాల్సి ఉంటుంది అంటూ నాని కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు…