Homeఎంటర్టైన్మెంట్Balakrishna: నందమూరి ఫ్యామిలీ లో బాలయ్యకు బాగా ఇష్టమైన వాళ్లు ఎవరో తెలుసా..?

Balakrishna: నందమూరి ఫ్యామిలీ లో బాలయ్యకు బాగా ఇష్టమైన వాళ్లు ఎవరో తెలుసా..?

Balakrishna: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్లింది అంటే అది ఎన్టీఆర్ వల్లే అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. కారణం ఏదైనా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత చాలామంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు. ఇక అందులో బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, […]

Balakrishna: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్లింది అంటే అది ఎన్టీఆర్ వల్లే అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. కారణం ఏదైనా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత చాలామంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు. ఇక అందులో బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు… మొత్తానికైతే బాలయ్య బాబు నట వారసుడిగా తన సత్తా చాటడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకపాత్ర వహించాడు. అయితే బాలయ్య బాబు గతంలో చాలా సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబుకి తన తండ్రి అయిన తారక రామారావు గారి తర్వాత ఆ ఫ్యామిలీలో బాగా నచ్చిన వారు ఎవరు అంటే ఆయన మాత్రం హరికృష్ణ పేరు చెబుతుంటాడు.

కారణం ఏంటి అంటే హరికృష్ణ ఏది ఉన్నా కూడా ఓపెన్ గా చెబుతారని అక్కడ ఒక మాట, ఇక్కడొక మాట మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ళ నాన్నను సైతం ఎదిరించి మాట్లాడగలిగే కెపాసిటీ కేవలం హరికృష్ణకు మాత్రమే ఉందని పలు సందర్భాల్లో బాలయ్య బాబు చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య కి హరికృష్ణ అంటే ఇష్టం ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ కి హరికృష్ణ చాలా దగ్గరగా ఉండేవాడు. అలాగే బాలయ్య చిన్నతనంలో ఉన్నప్పుడు తనకు ఏది కావాలన్నా కూడా హరికృష్ణ ను అడిగి తీసుకునేవారట. ఎన్టీఆర్ ఎప్పుడు సినిమాల్లో, పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండేవాడు.

కాబట్టి అతనితో ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం బాలయ్య బాబుకు దొరకలేదు. దానివల్ల హరికృష్ణ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పడం విశేషం…ప్రస్తుత హరికృష్ణ మన మధ్య లేకపోయిన కూడా బాలయ్య బాబు అలాగే వాళ్ళ అభిమానులు సైతం అప్పుడప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper