HomeNewsNagma: కాస్ట్యూమ్ కొనుక్కోమంటే రెండు పొట్టి నిక్కర్లు కొన్న నగ్మా... బిల్లు చూసి నిర్మాత షాక్!

Nagma: కాస్ట్యూమ్ కొనుక్కోమంటే రెండు పొట్టి నిక్కర్లు కొన్న నగ్మా… బిల్లు చూసి నిర్మాత షాక్!

Nagma: హీరోయిన్ నగ్మాకు పొగరు అనే వాదన ఉంది. ఆమె సెట్స్ లో యాటిట్యూడ్ చూపించేదట. పలువురు హీరోలతో ఆమెకు గొడవలు అయ్యాయనే వాదన ఉంది. కాగా ఓ మూవీ కోసం నిర్మాత ఆమెనే కాస్ట్యూమ్స్ కొనుక్కో అన్నారట. రెండు పొట్టి నిక్కర్లు కొన్న నగ్మా.. భారీ మొత్తంలో బిల్లు పంపిందట.

Also Read: ఓవర్సీస్ లో 2వ రోజు కూడా దుమ్ములేపిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!

పెద్దింటి అల్లుడు మూవీతో తెలుగులో అడుగుపెట్టింది నగ్మా. అనంతరం నాగార్జునకు జంటగా కిల్లర్ మూవీ చేసింది. ఇది హిట్ కావడంతో ఏకంగా చిరంజీవి పక్కన ఛాన్స్ వచ్చింది. ఘరానా మొగుడు చిత్రంలో నగ్మా-చిరంజీవి జతకట్టారు. వీరి కాంబోలో మరికొన్ని చిత్రాలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ హోదా రాబట్టిన నగ్మా టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసింది. నగ్మాకు టెక్కు ఎక్కువ అనే వాదన ఉంది. ఆమె చాలా పొగరుగా ఉండేవారట. శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన అడవి దొర చిత్రంలో నగ్మా హీరోయిన్. ఈ సినిమా షూట్ కి నగ్మా ఆలస్యంగా వచ్చిందట.

ఆమె కోసం గంటల తరబడి వేచి చూసిన శోభన్ బాబు.. సెట్ లోనే ఆమెకు గట్టిగా ఇచ్చాడట. రిక్షావోడు మూవీ సెట్స్ లో చిరంజీవితో కూడా ఆమెకు గొడవైందనే వాదన ఉంది. ఇదిలా ఉంటే.. ఆమె చేసిన పనికి ఓ నిర్మాతకు మైండ్ బ్లాక్ అయ్యిందట. సాగర్ దర్శకత్వంలో కృష్ణ భారత సింహం టైటిల్ తో ఒక మూవీ చేశాడు. ఈ మూవీలో నగ్మా హీరోయిన్. ఓ సన్నివేశంలో నగ్మా పొట్టి నిక్కర్ ధరించాల్సి ఉంటుందట. మనం కాస్ట్యూమ్ కొనడం ఎందుకు? ఆమెనే కొనుక్కోమని చెబుదాం. ఆ బిల్ ఇచ్చేద్దాం అని, నిర్మాతతో దర్శకుడు సాగర్ అన్నాడట.

ఈ విషయం నగ్మాకు చెప్పడంతో రెండు పొట్టి నిక్కర్లు కొనుగోలు చేసిన నగ్మా రూ. 60 వేలు బిల్లు నిర్మాతకు పంపిందట. దర్శకుడు సాగర్ తో పాటు నిర్మాత షాక్ అయ్యారట. రెండు పొట్టి నిక్కర్లు రూ. 60 వేలా అని నోరెళ్ళ బెట్టారట. 1995లో అరవై వేలు అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ రోజుల్లో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ సైతం లక్షల్లో ఉండేది. మరి నగ్మా పంపిన అరవై వేల బిల్లు నిర్మాత చెల్లించాడా లేదా? అనేది తెలియదు.

నగ్మా తెలుగులో నటించిన చివరి చిత్రం నిను చూడక నేనుండలేను. 2002లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అల్లరి రాముడు మూవీలో నగ్మా అత్త పాత్ర చేయడం విశేషం. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది. అల్లరి రాముడు చిత్రంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

 

Also Read: మహేష్ బాబు కుటుంబ నుంచి మరో ఇద్దరు స్టార్ హీరోలు రానున్నారా..?

RELATED ARTICLES

Most Popular