Indian Cricketers : మనదేశంలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. క్రికెటర్లకు వర్ణించలేనంత అభిమానం గణం ఉంటుంది. ఆటగాళ్లు వికెట్లు పడగొట్టినా.. పరుగులు చేసినా.. ఓవర్ నైట్ లో వారి తలరాత మారిపోతుంది. కోట్లకు కోట్లు చెంతకు వచ్చేవాళ్లుతాయి. విపరీతమైన పేరు వచ్చిపడుతుంది.. ఇక్కడితోనే వారి చరిష్మా ఆగిపోదు. అమ్మాయిలు కూడా ఆ క్రికెటర్ల పై ఆసక్తిని పెంచుకుంటారు. ముఖ్యంగా సినిమాల్లో నటించేవారు క్రికెటర్ల పై మనసు పారేసుకుంటారు.. మనదేశంలో క్రికెటర్లకు, హీరోయిన్ల మధ్య అవినాభావ సంబంధం ఎప్పటినుంచో ఉంది. కొంతమంది క్రికెటర్లు అత్యంత రహస్యంగా హీరోయిన్లతో సంబంధాలు నడిపారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. కానీ సోషల్ మీడియా లేని కాలంలో.. నాటి క్రికెటర్ల, హీరోయిన్ల వ్యవహారాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. అయినప్పటికీ అప్పటి కాలంలోనూ కొంతమంది వ్యవహారాలు సంచలనం సృష్టించాయి.
అజారుద్దీన్
టీమిండియా కు సారధిగా వ్యవహరించిన ఈ హైదరాబాద్ ఆటగాడు.. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకునేవాడు.. ఇతడు మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తే ప్రత్యర్థి ప్లేయర్లకు దిమ్మ తిరిగిపోయేది. అయితే అజహార్ తన మొదటి భార్య నౌరీన్ తో విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో అతడు సంగీత బిజిలాని అనే బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నాడు. అప్పట్లో అది ఒక సంచలనం. ఆ తర్వాత అతడి జ్వాల అనే బ్యాడ్మింటన్ ప్లేయర్ తో కూడా వ్యవహారం నడినట్టు వార్తలు వినిపించాయి. ఆమె వ్యవహారం వల్లే సంగీతకు అజహర్ విడాకులు ఇచ్చినట్టు సమాచారం.
సౌరవ్ గంగూలీ
బెంగాలీ టైగర్ గా పేరుపొందిన ఈ ఆటగాడు టీమిండియాలో సృష్టించిన సంచలనాలు చెప్పాలంటే ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది. ఇతడి నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ఇతడికి భార్య ఉన్నప్పటికీ.. ఆమె ద్వారా ఒక కుమార్తె కలిగినప్పటికీ.. అప్పటి హీరోయిన్ నగ్మాతో వ్యవహార సాగించాడని వార్తలు నిర్మించాయి. ఓ వన్డే వరల్డ్ కప్ సమయంలో వీరిద్దరూ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారని.. రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే అతని వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో నగ్మాతో బంధాన్ని గంగూలీ తెంచుకున్నాడని సమాచారం.
వినోద్ కాంబ్లీ
సచిన్ స్నేహితుడిగా.. ఒకప్పటి టీమ్ ఇండియాలో సంచలన ఆటగాడిగా పేరుపొందాడు వినోద్. అప్పట్లోనే అతడు నోయిల్లా లూయిస్ ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆండ్రియా హేవిట్ తో రిలేషన్ కొనసాగించాడు. ఆమె ఒక ఫ్యాషన్ మోడల్. అయితే కొంతకాలానికి హేవిట్ ఈ బంధానికి ముగింపు పలికింది. ఆ తర్వాత ఆమె వివాహం చేసుకుంది.
రవి శాస్త్రి
విలక్షణమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు రవి శాస్త్రి. భారత జట్టు శిక్షకుడిగా.. దిగ్గజ వ్యాఖ్యాతగా రవి శాస్త్రికి పేరు ఉంది. రవి శాస్త్రి ఆట తీరుతోనే కాదు.. సంబంధాల విషయంలోనూ దిట్టే. రవి శాస్త్రి అప్పట్లోనే బాలీవుడ్ నటి అమృత సింగ్ తో ప్రేమ వ్యవహారం నడిపినట్టు సమాచారం. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారని.. ఆ తర్వాత ఎవరి దారులు వారు చూసుకున్నారు.
కపిల్ దేవ్
టీమిండియాకు తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్.. ఎఫైర్లు నడిపే విషయంలోనూ అదే స్థాయి కొనసాగించాడు. అప్పట్లో బాలీవుడ్ నటి సారికతో అతడు రిలేషన్ కొనసాగించాడు. ముంబై వీధులలో వారిద్దరు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేవారు. అప్పట్లోనే వీరిద్దరి బంధంపై రకరకాల విమర్శలు వచ్చాయి. రోమిని వివాహం చేసుకోవడాని కంటే ముందే కపిల్ సారికతో రిలేషన్ కొనసాగించాడు. అయితే నాటి రోజుల్లో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. విడిపోయారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు.