Nagma : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం పాటు ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. స్టార్ హీరోలు సంవత్సరాల తరబడి ఇండస్ట్రీని ఏలుతూ ముందుకు సాగుతున్న క్రమంలో హీరోయిన్లు మాత్రం అతి తక్కువ సమయం మాత్రమే తమ కెరీయర్ ను ఇండస్ట్రీలో కొనసాగిస్తారు. ఎన్ని సక్సెస్ లు వచ్చాయనే విషయం పక్కన పెడితే ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినా కూడా హీరోయిన్ కి భారీ అవకాశాలు వచ్చే ఛాన్సులైతే చాలా తక్కువగా ఉంటాయనే చెప్పాలి… అందుకే హీరోయిన్ కెరియర్ ఎన్ని రోజుల పాటు ఉంటుందనేది ఎవరు అంచన వేయలేరు…
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి నగ్మా… తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆమె యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ అలరించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఆమెకు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆమె ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది కానీ అనుకోని కారణాలవల్ల ఆమె పెళ్లికి దూరంగా ఉంటూ వస్తుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ తో కొన్ని రోజులపాటు డేట్ కూడా చేసినట్టుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పటికే సౌరవ్ గంగూలీకి పెళ్లై ఉండడం వల్ల తన భార్య నగ్మా కి భారీ వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ల మధ్య ఉన్న సన్నిహిత్యం కాస్త బ్రేకప్ అయిపోయినట్టుగా తెలుస్తోంది.
Also Read : అప్పటి ముచ్చట్లు : నగ్మా చేసిన పనికి చిర్రెత్తిపోయిన శోభన్ బాబు… నీ ఆస్తి విలువ నా బాత్రూమ్ ఖరీదు ఉండదంటూ!
మొదట్లో ఆమె పెళ్లి చేసుకుంటే సౌరవ్ గంగూలీ మాత్రమే చేసుకుంటాను లేకపోతే ఇలాగే ఉంటాను అంటూ పలువురు దగ్గర తన అభిప్రాయాన్ని తెలియజేసిందట. గంగూలి తో బ్రేకప్ అయిపోవడం వల్ల ఆమె మరెవరిని పెళ్లి చేసుకోకుండా అప్పటినుంచి ఇప్పటివరకు సింగిల్ గానే ఉంటుందంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపైతే ఉంది.
ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది. మరి మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి మంచి క్యారెక్టర్ దొరికితే తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే ఇచ్చారు. మరి తనకు సరిపడా కథ దొరికితే మాత్రం ఆమె సిల్వర్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది…
Also Read : ట్రోల్ ఆఫ్ ది డే : నగ్మాతో ఎన్టీఆర్ రొమాన్స్.. నాటు నాటు కు పునాదులేసింది ఇక్కడి నుంచేనట!