spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagarjuna - Akhil Multistarrer: 'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో నాగార్జున - అఖిల్ మల్టీస్టారర్...

Nagarjuna – Akhil Multistarrer: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ తో నాగార్జున – అఖిల్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్..ఫాన్స్ కి ఇక పండగే

Nagarjuna – Akhil Multistarrer: అక్కినేని అభిమానులను ఇటీవలే విడుదలైన నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి మన అందరికి తెలిసిందే..దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం సాధించిన సినిమాగా నిలిచింది..విడుదలకు ముందు టీజర్ మరియు ట్రైలర్ తో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలను పుట్టించడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది..కానీ ఈ చిత్రం వసూళ్లు ఫుల్ రన్ లో కనీసం 5 కోట్ల రూపాయిలు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు..దీనితో అక్కినేని అభిమానులు బాగా నిరాశకి గురైయ్యారు..ఈ వయస్సులో కూడా ప్రయోగాత్మక సినిమాలు తియ్యడం ఎందుకు..కమర్షియల్ సినిమాలు చేసి మమల్ని ఆనందింపచెయ్యొచ్చు కదా, ఈ టార్చర్ ఏంటి మాకు అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో బాధపడుతూ ఉన్నారు..అలాంటి అభిమానులకు ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త శుభవార్త అనే చెప్పాలి.

Nagarjuna - Akhil Multistarrer
Nagarjuna – Akhil Multistarrer

అదేమిటి అంటే మెగాస్టార్ చిరంజీవి కి లేటెస్ట్ గా గాడ్ ఫాదర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన డైరెక్టర్ మోహన్ రాజా అక్కినేని నాగార్జున మరియు ఆయన తనయుడు అఖిల్ ని పెట్టి ఒక మల్టీస్టార్ర్ర్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట..ఇటీవలే నాగార్జున గారిని కలిసి ఈ కథ వినిపించగా ‘ఇలాంటి కథ కోసమే కదా అయ్యా..ఇంతకాలం నేను ఎదురు చూసింది’ అంటూ మోహన్ రాజా ని కౌగలించుకొని, నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి నేను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట..మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో మనం గాడ్ ఫాదర్ సినిమాలో చూసాము.

Nagarjuna - Akhil Multistarrer
Nagarjuna – Akhil Multistarrer

పేరుకి అది మలయాళం లూసిఫెర్ సినిమాకి రీమేక్ అయ్యినప్పటికీ కూడా తెలుగు కి తగట్టు మార్పులు చేర్పులు చేసి , అసలు రీమేక్ సినిమాని చూస్తున్న అనుభూతిని ఆడియన్స్ కి కలగనివ్వకుండా ఒక కొత్త సినిమాని చూస్తున్నట్టే తెరకెక్కించాడు..అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో అలాగే చూపించాడు మోహన్ రాజా..కచ్చితంగా అక్కినేని అభిమానులకు కూడా అలాంటి ట్రీట్ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి.

 

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper