Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా, కచ్చితంగా టాప్ 3 రేంజ్ లో ఉంటాడు అనుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు నాగ మణికంఠ. అలాంటి కంటెస్టెంట్ ఆరోగ్య సమస్యల కారణంగా చేత తనకి తానూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో నాగ మణికంఠ అభిమానులు షాక్ కి గురి అయ్యారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ, మణికంఠ తుమ్మినా, దగ్గినా తప్పు చేసినట్టుగా అతన్ని నిందించడం వల్ల మానసికంగా కృంగిపోయి, తనని తానూ సెల్ఫ్ ఏవిక్షన్ చేసుకున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నాగమణికంఠ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇంకా పూర్తి కాకముందే, యూట్యూబ్ లో నిన్న రాత్రి బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు.
ఈ ప్రోమో లో అంబటి అర్జున్ మణికంఠ ని చాలా సూటి ప్రశ్నలు అడిగాడు. ప్రేక్షకుల మదిలో మణికంఠ గురించి ఎలాంటి ప్రశ్నలు అయితే అడగాలని కోరుకున్నారో, అలాంటి ప్రశ్నలే అడిగాడు అర్జున్. ముందుగా ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ‘అసలు టైటిల్ విన్ అవ్వాలనే కసితో హౌస్ లోకి అడుగుపెట్టిన మీరు, కనీసం చీఫ్ కూడా అవ్వకుండా బయటకి ఎందుకు వచ్చారు’ అని అడుగుతాడు. అప్పుడు మణికంఠ ‘విన్నర్ అవ్వాలనే ఆలోచనతో మాత్రం నేను రాలేదు’ అని అంటాడు. దానికి అర్జున్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ, ఎంత పెద్ద కంటేంటో తెలుసా అది?. ‘నా పెళ్ళాం బిడ్డలు నాకు కావాలి. నా గౌరవం నాకు కావాలి’ అని గోడ వైపుకి తిరిగి నాగమణికంఠ హౌస్ లో ఎమోషనల్ గా మాట్లాడిన మాటల్ని అర్జున్ యాక్షన్ చేసి చూపిస్తాడు. దీనికి మణికంఠ నుండి షాకింగ్ రియాక్షన్ వస్తుంది. మణికంఠ ఇక్కడ కచ్చితంగా ఫ్లిప్ అయ్యాడు అనే చెప్పాలి. ఎందుకంటే అతను మొదటి 5 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి, టైటిల్ కొట్టాలి, ఎంత కష్టమైన టాస్క్ అయినా ఆడాలి అనే కసితో ఉండేవాడు.
మొదటి వారం లో మీరు చెప్పిన ఫ్యామిలీ ఎమోషన్స్, 5వ వారం లో కనిపించలేదు, ఎందుకని? అని అర్జున్ అడగగా, దానికి మణికంఠ సమాధానం చెప్తూ ‘నేను ఇంతే..పెద్ద తేడా’ అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. హౌస్ మేట్స్ అందరి అభిప్రాయం ఏమిటంటే, గోరంత విషయాన్ని మీరు కొండంత చేస్తారు అని, దానికి మీరేమంటారు అని మణికంఠ ని అర్జున్ అడగగా, దానికి మణికంఠ సమాధానం చెప్తూ ‘నేను ఆలోచించే విధానం అలా ఉంది కాబట్టి, స్పందించే విధానం కూడా అలాగే ఉండేది’ అని చెప్తాడు. అసలు నువ్వు హౌస్ లో రెమోవో, రామువో, అపరిచితుడివో ఎవ్వరికీ అర్థం కాదు అంటూ అర్జున్ నవ్వగా, దానికి మణికంఠ కూడా నవ్వుతాడు. పూర్తి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది మరికాసేపట్లో తెలియనుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Naga manikantha exclusive exit interview with ambati arjun
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com