Homeఎంటర్టైన్మెంట్Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. తొలిసారిగా స్పందించిన సల్మాన్ ఖాన్.. ఇంతకీ ఏమన్నారంటే..

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. తొలిసారిగా స్పందించిన సల్మాన్ ఖాన్.. ఇంతకీ ఏమన్నారంటే..

Salman Khan: సిద్ధిఖి హత్య తర్వాత అతడి కుటుంబాన్ని పరామర్శించడానికి సల్మాన్ ఖాన్ వెళ్లారు. హిందీ బిగ్ బాస్ షో షూటింగ్ మధ్యలోనే ఆపివేసి సల్మాన్ ఖాన్ వెళ్లిపోయారు. సిద్ధిఖి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత సల్మాన్ ఖాన్ మళ్లీ బిగ్ బాస్ షూటింగ్లో పాల్గొన్నారు. లారెన్స్ గ్యాంగ్ నుంచి వస్తున్న బెదిరింపులు నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారని.. మహారాష్ట్ర పోలీసులు కూడా బందోబస్తును పెంచారని.. సల్మాన్ ఖాన్ వ్యవసాయ క్షేత్రం వద్ద సెక్యూరిటీని విస్తృతం చేశారని.. అరబ్ దేశాల నుంచి యుద్ధ ప్రాతిపదికన బుల్లెట్ ప్రూఫ్ కారును సల్మాన్ ఖాన్ దిగుమతి చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే దీనిని సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించలేదు. పైగా సల్మాన్ ఖాన్ తండ్రి తన కొడుకు బొద్దింకకు కూడా హాని తలపెట్టడని.. అలాంటిది కృష్ణ జింకను ఎందుకు హతమార్చు తాడని పేర్కొన్నాడు.

బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొన్నాడు

సల్మాన్ ఖాన్ ఇటీవల బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ శనివారం ప్రసారమైంది. అయితే సల్మాన్ ఖాన్ గతంలో మాదిరి ఉత్సాహంగా ఇందులో కనిపించలేదు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఆ వారం మొత్తం చేసిన తప్పులను సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..” నేను ఈ షోకు హాజరు కాకూడదని అనుకున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి సభ్యులు ఎలాంటి భావాలను వ్యక్తం చేసినప్పటికీ వాటిని పట్టించుకోవద్దు. వాస్తవానికి నేను కూడా ఈరోజు ఇక్కడికి రావద్దననుకున్నాను. కానీ నా వృత్తి కాబట్టి తప్పకుండా రావాల్సిందే. వృత్తి పట్ల నాకు నిబద్ధత ఉంది. అందువల్లే ఇక్కడికి వచ్చాను. దీనికోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నానని” సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. సల్మాన్ ఖాన్ చేసిన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఇప్పటికీ కోర్టుల నుంచి ఉపశమనం లభించలేదు. ఆ కేసు అలా సాగుతుండగానే లారెన్స్ బృందం నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్నాయి. దానికి తోడు ఆయన స్నేహితుడు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధిఖి ని లారెన్స్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. దీంతో ఒక్కసారిగా లారెన్స్ పేరు జాతీయ మీడియాలో చర్చనీయాశంగా మారింది. దీంతో సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఇక బిగ్ బాస్ షూటింగ్లో పాల్గొన్నప్పుడు సల్మాన్ ఖాన్ కు 60 మంది సిబ్బంది భద్రతను కల్పించారు. ఆయనను నిరంతరం పర్యవేక్షించారు. ఇతర వ్యక్తులను బిగ్ బాస్ సెట్ లోకి అనుమతించలేదు. షూటింగ్ పూర్తయ్యే వరకు షూట్ సిబ్బందిని బయటికి పంపించలేదు.. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సెట్ లోకి ప్రవేశించ కంటే ముందే సెక్యూరిటీ సిబ్బంది సెట్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.. అంతేకాదు సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కూడా భద్రతను భారీగా పెంచినట్టు సమాచారం. అనుమానిత వ్యక్తులను సల్మాన్ ఖాన్ ఇంటికి సమీపంలోకి కూడా రానివ్వడం లేదని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular