Mouli Remuneration: నిన్న మొన్నటి వరకు స్టాండప్ కమెడియన్ గా, ఒక యూట్యూబర్ గా ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన మౌళి(Mouli Talks), ఇప్పుడు ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) చిత్రం తో హీరో గా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మన కళ్ళ ముందే యూట్యూబ్ లో సరదాగా వీడియోస్ చేసుకుంటూ తిరిగిన ఒక కుర్రాడు, ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యాడంటే ప్రతీ సామాన్యుడికి గర్వ కారణమే. ఇలాంటోళ్ళు సక్సెస్ అయ్యినప్పుడే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు, మేము కూడా ఇతని పద్దతిలో ప్రయత్నం చేయొచ్చు ఏమో అనే నమ్మకం కలుగుతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి ఆరు రోజుల్లో అక్షరాలా 21 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కేబలం ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
Also Read: ‘మిరాయ్’ మూవీ హీరోయిన్..తేజ సజ్జ కంటే వయస్సులో ఎంత పెద్దనో తెలుసా?
కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఒక చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు, లాభాలు రావడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది కదా, నిర్మాతలు మౌళి కి ఏ రేంజ్ పారితోషికం ఇచ్చి ఉంటారో అని మీరంతా ఇప్పటికే అంచనాలు వేసుకుంటూ ఉండుంటారు. అయితే సినిమా చేస్తున్న సమయం లో మౌళి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు కానీ, సినిమా విడుదలై ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యాక ఆయనకు నిర్మాతలు పిలిచి మరీ మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చారట. కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం అంటే ఇదే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి చిత్రాల్లో నటించిన తేజ సజ్జ కూడా మొదటి రెండు సినిమాలకు చెరో రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకున్నాడట. కానీ మౌళి మొదటి సినిమాతోనే మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మౌళి ఇదే విధంగా కెరీర్ లో విభిన్నమైన క్యారెక్టర్లు, సినిమాలు చేస్తూ ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశం లేకపోలేదు.