Hari Hara Veeramallu Success Meet: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమానకి మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ మూవీతో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటాడు అనుకున్న వాళ్ళందరికి చెడు అనుభవమే మిగిలింది. ఇక ఇప్పుడు ఈ సినిమా యూనిట్ కలిసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి దస్పల్ల హోటల్లో హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహిస్తున్నారు. ఈ మీట్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నాడు. కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద మొదట్లో ఎవరికి హైప్ అయితే లేదు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ లో యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ తోనే చేయించారా?
దానివల్లే ఆయన సినిమా మీద హైప్ పెంచి సినిమాకి భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకొని మరి ప్రమోషన్స్ అయితే చేశాడు. కానీ ఇప్పుడు సినిమా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సక్సెస్ అని సినిమా చూసినవాళ్లు ఎవ్వరు కూడా చెప్పడం లేదు. అలాగే ప్రతి రివ్యూవర్ కూడా ఈ సినిమా మీద నెగెటివ్ ఓపెనియన్ చెప్పారు.
ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించడం ఎందుకు… సినిమా కంటెంట్ బాగున్న దాన్ని సరైన వే లో ప్రజెంట్ చేయలేదు.దాని వల్లనే సినిమాకి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి…కాబట్టి ఇప్పుడు సినిమా యూనిట్ సక్సెస్ మీట్ పెట్టినంత మాత్రాన జనాలు ఈ సినిమాకి వెళ్తారా..? ఇలాంటి మీట్స్ పెట్టీ ఎవరి చెవిపో పూలు పెట్టాలనుకుంటున్నారు. అంటూ కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
మొత్తానికైతే సినిమాకి ఏదో ఒకటి చేసి హైప్ తీసుకువస్తే సినిమా బయటపడుతుంది… పెట్టిన బడ్జెట్ అయిన రికవరీ అవుతుంది అని సినిమా యూనిట్ భావిస్తోంది…కానీ కొంతమంది మాత్రం బాగాలేని సినిమాకు ఇలాంటి మీట్స్ పెట్టడం జనాలను మోసం చేయడం అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…