Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మీక మందన్నా జంటగా నటిస్తున్న ‘పుష్ప. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. కాగా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ నెల 17 న రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతుంది చిత్ర బృందం. సాధారణంగా సుకుమార్- అల్లు అర్జున్ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఆర్య, ఆర్య2 సినిమాల్లో బన్నీని కొత్తగా చూపించడమే అందుకు కారణం. మరోవైపు రంగస్థలంతో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చి సుకుమార్.. ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక సుకుమార్- దేవి శ్రీ కాంబోలో వచ్చే సినిమాలో ఐటెం సాంగ్ కూడా స్పెషల్ గానే ఉంటుంది. ఈ క్రమం లోనే పుష్ప లోని ఐటెం సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. “ఊ అంటావా మామ… ఊహూ అంటావా మామ” పేరుతో వచ్చిన ఈ సాంగ్‌లో సమంత తన అందాలు ఆరబోస్తూ… హాట్ లుక్స్‌తో కుర్రకారి హృదయాల్ని కొల్లగొడుతుంది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
విడుదలైన 12 గంటల్లోనే 8 మిలియన్ వ్యూస్‌కు చేరుకుంది. ప్రస్తుతం 10 మిలియన్స్ చేరువలో దూసుకెళ్లిపోతోంది. దీంతో దేవిశ్రీ తన మ్యూజిక్‌తో మరోసారి మాయ చేశారనే చప్పాలి.‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సమంతపై చిత్రించిన ఈ ఐటెమ్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండవ్వుతోంది. అయితే, ఇదే పాటను ఓ నెటిజన్ బ్రహ్మానందం సీన్లతో రీమిక్స్ చేసి.. ట్వీట్ చేశాడు. అంతే.. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఆ పాటను స్వరపరిచిన దేవీశ్రీ ప్రసాద్ కూడా రిట్వీట్ చేసుకున్నాడు. దిస్ ఈజ్ హిల్లెరియస్… సూపర్ ఎడిట్ అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఈ వీడియోను రీట్వీట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బ్రహ్మీ ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే ఎడిట్ చేశారంటూ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/ThisIsDSP/status/1469560505748443136?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1469560505748443136%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fsamantha-in-pushpa-brahmanandam-s-oo-antava-oo-oo-antava-song-spoof-viral-13697