Extra-Marital Affair: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే హత్యలు, గొడవలు జరిగి కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. కాగా, తాజాగా ఓ మహిళ తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పారిశుధ్య కార్మికురాలిని అంతమొందించింది. పోలీసులు దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

ఆంధప్రదేశ్‌లోని కృష్ణలంకలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..రౌతు సత్య అనే 36 ఏళ్ల మహిళ తన కూతురుతో కలిసి రాణిగారి తోట 18వ డివిజన్ కరెంటు ఆఫీసు పరిసరాల్లోని ఓ ఇంటిలో ఉంటుంది. తన భర్త భవానీపురంలో కార్మికుడు. ఇక సత్య ఏలూరు రోడ్డులో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిసర ప్రాంతంలో ఉండే ఆదినారాయణతో సత్యకు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధం వరకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సత్య భర్త సత్యపై కోప్పడ్డాడు. పలు మార్లు వీరిద్దరి మధ్య ఈ విషయమై గొడవ కూడా జరిగింది. అయితే, భార్య సత్య ఈ విషయంలో మారడం లేదని అనుకుని విసుగు చెందిన భర్త కుటుంబానికి దూరంగా వెళ్లిపోయాడు.
Also Read: స్టేడియంలోనే లవ్.. ప్రపోజ్ తో ప్రేక్షకులంతా కెవ్వు
ఈ వివాహేతర సంబంధం విషయం ఆదినారాయణ భార్య మల్లేశ్వరికి తెలిసింది. దాంతో మల్లేశ్వరి, సత్యతో గొడవ పెట్టుకుంది. వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే ఉన్న ఇంటిని ఖాళీ చేసి తన కూతురితో కలిసి వేరే ఇంటికి షిఫ్ట్ అయింది. ఆ ఇంటికీ ఆదినారాయణ వెళుతూ ఉండేవాడు. అలా వివాహేతర సంబంధం కంటిన్యూ అవుతూ ఉండేది.
ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం సత్యను హత్య చేయాలనుకున్న ఆదినారాయణ భార్య మల్లేశ్వరి లక్కీబార్ వద్ద సత్య ఉంటున్న ఇంటిలోకి వెళ్లింది. తనతో చాకు, బ్లేడు తీసుకుని వెళ్లిన మల్లేశ్వరి ఇంటి లోపల సత్య గొంతు కోసినట్లు, ఆ తర్వాత రోకలిబండతో తలపై పలు మార్లు బాదినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ విషయం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాకే కనిపెట్టారు. తాను హత్యకు పాల్పడినట్లు నిందితురాలు మల్లేశ్వరి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.
Also Read: వర్క్ ఫ్రం హోమ్ ఎఫెక్ట్.. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పరిస్థితి ఏమైందో తెలిస్తే షాకే?