Homeఎంటర్టైన్మెంట్Mrityunjay Movie Box Office Collection: మొదటి రోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు.....

Mrityunjay Movie Box Office Collection: మొదటి రోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు.. బాక్స్ ఆఫీస్ వద్ద ‘మృత్యుంజయ్’ ఊహించని ర్యాంపేజ్!

Mrityunjay Movie Box Office Collection: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మృత్యుంజయ్'(Mrityunjay Movie) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి రివ్యూస్ ని తెచ్చుకొని డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించింది. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యిందో లేదో కూడా తెలియదు, కనీస స్థాయి వసూళ్లు కూడా రావని అంతా అనుకున్నారు. కానీ శ్రీ విష్ణు కి యూత్ ఆడియన్స్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ సినిమాకు […]

Mrityunjay Movie Box Office Collection: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మృత్యుంజయ్'(Mrityunjay Movie) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి రివ్యూస్ ని తెచ్చుకొని డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించింది. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యిందో లేదో కూడా తెలియదు, కనీస స్థాయి వసూళ్లు కూడా రావని అంతా అనుకున్నారు. కానీ శ్రీ విష్ణు కి యూత్ ఆడియన్స్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో మొదటి రోజు ఈ చిత్రానికి 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, రెండవ రోజు ఏకంగా 25 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్థాయి గ్రోత్ ఈ సినిమాకు ఉంటుందని బహుశా నిర్మాతలు కూడా ఊహించి ఉండరు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు , రెండవ రోజు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు రెండవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. కర్ణాటక + ఓవర్సీస్ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 40 లక్షల షేర్. మొత్తం మీద ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కోటి 40 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు కచ్చితంగా రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవ్వొచ్చు. విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల 50 లక్షల రూపాయిలు . మూడు రోజులకు కలిపి ఈ చిత్రం 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వారం రోజుల క్రితమే శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , డివైడ్ టాక్ తెచ్చుకొని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంది. దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కుకి ఈ చిత్రం దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ‘మృత్యుంజయ్ ‘ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి టాక్ తెచ్చుకొని ఇది కూడా బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తోంది. చూస్తుంటే శ్రీవిష్ణు టైం ప్రస్తుతం మామూలు రేంజ్ లో నడవడం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper