Homeఎంటర్టైన్మెంట్ఫైనల్ కి ముందు రచ్చ... కేసుపెట్టిన మోనాల్

ఫైనల్ కి ముందు రచ్చ… కేసుపెట్టిన మోనాల్

మరో నాలుగు రోజులలో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే జరగనుండగా మోనాల్ గజ్జర్… అభిజీత్ ఫ్యాన్స్ మరియు పిఆర్ టీమ్ పై సైబర్ కేసుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మోనాల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. మోనాల్ గజ్జర్ చివరి ఎలిమినేషన్ గా హౌస్ నుండి బయటికి వచ్చారు. ఎలిమినేటైన మోనాల్ ని ఇదే సీజన్లో పాల్గొన్న జోర్దార్ సుజాత ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అభిజీత్ ఫ్యాన్స్ పై సైబర్ కేసుపెట్టినట్లు మోనాల్ […]

Monal
మరో నాలుగు రోజులలో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే జరగనుండగా మోనాల్ గజ్జర్… అభిజీత్ ఫ్యాన్స్ మరియు పిఆర్ టీమ్ పై సైబర్ కేసుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మోనాల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. మోనాల్ గజ్జర్ చివరి ఎలిమినేషన్ గా హౌస్ నుండి బయటికి వచ్చారు. ఎలిమినేటైన మోనాల్ ని ఇదే సీజన్లో పాల్గొన్న జోర్దార్ సుజాత ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అభిజీత్ ఫ్యాన్స్ పై సైబర్ కేసుపెట్టినట్లు మోనాల్ గజ్జర్ తెలియజేశారు.

Also Read: ప్రేక్షకులను థియేటర్లకు రప్పించబోతున్న ‘షకీలా’..!

మోనాల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా… ఆమెను కలవడానికి అక్క హేమాలి వచ్చారు. ఇంటి సభ్యులు అందరితో మాట్లాడిన హేమాలి అభిజీత్ కి మాత్రం వార్నింగ్ ఇచ్చింది. మోనాల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావ్ అన్న హేమాలి, ఏదైనా కానీ ముందు మాట్లాడు, వెనుక మాట్లాడకని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అభిజీత్ కొంచెం నొచ్చుకున్నాడు. అభిజీత్ ని విపరీతంగా ఇష్టపడే హారిక సైతం హేమాలి వ్యాఖ్యలకు బాధపడ్డారు. హేమాలి అభిజీత్ కి వార్నింగ్ ఇవ్వడం ఆయన ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది.

Also Read: ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలుస్తానంటున్న మెగా హీరో !

దీనితో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారట. సోషల్ మీడియాలో చంపేస్తాం అంటూ వేధింపులకు దిగారట. మానసికంగా హేమాలిని వేధించారన్న మోనాల్ సైబర్ పోలీసులుకు సదరు ఫ్యాన్స్ పై కేసుపెట్టినట్లు తెలియజేశారు. మరికొద్ది రోజులలో ఫైనల్ ఉండగా మోనాల్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. మరో వైపు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరనే ఊహాగానాలు మొదలైపోయాయి. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడుస్తుంది. అభిజీత్, అరియనా, సోహైల్ టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper