Bigg Boss 4 : తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో సీజన్ 4 ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అని బిగ్ బాస్ ప్రేక్షకులు అంటుంటారు. ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు, అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా పండాయి. కంటెస్టెంట్స్ కి కూడా మంచి మార్కులు వచ్చాయి. అందుకే టీఆర్ఫీ రేటింగ్స్ అప్పట్లో మోతెక్కిపోయేవి. వీకెండ్ ఎపిసోడ్ కి 18 కి పైగా రేటింగ్స్ వస్తే, మామూలు ఎపిసోడ్స్ కి 9 రేటింగ్స్ వచ్చాయి. అన్ని సీజన్స్ ఫినాలే ఎపిసోడ్స్ కంటే ఈ సీజన్ లోని ఫినాలే ఎపిసోడ్ కి బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. అయితే ఈ సీజన్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి అభిజిత్, అఖిల్, సోహైల్ తో పాటు మోనాల్ గజ్జర్ కూడా ఒక ప్రధాన కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మోనాల్ లేకపోతే అభిజిత్, అఖిల్ వంటి వారు ఆ రేంజ్ లో హైలైట్ అయ్యేవాళ్ళు కాదు అనేది వాస్తవం. ఈ ముగ్గురు మధ్య నడిచిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, ఆ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కారణం అఖిల్, అభిజిత్ మధ్య నడిచిన గొడవలు అప్పట్లో ప్రేక్షకులను టీవీ లకు అత్తుక్కుపోయి చూసేలా చేసాయి. అయితే చివరికి అఖిల్, మోనాల్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే వీళ్లిద్దరు బయటకి వచ్చిన తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అనే రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత మంచి స్నేహితులు లాగా అయితే ఉన్నారు కానీ, హౌస్ లో ఉన్నట్టుగా ప్రేమికులుగా అయితే ఉండలేదు. మోనాల్ గజ్జర్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు కనిపించింది కానీ, ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోయింది. వచ్చిన కొత్తల్లో ఈమె బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం లో ‘రంభ ఊర్వశి మేనకా’ వంటి సూపర్ హిట్ ఐటెం సాంగ్ లో నటించింది.
బయటకి వచ్చిన తర్వాత తెలుగు లో ఈమెకి అవకాశాలు క్యూలు కడుతాయని అందరూ అనుకున్నారు కానీ, అది జరగలేదు. 2020 వ సంవత్సరం లో ఓంకార్ స్టార్ మా లో నిర్వహించిన ‘డ్యాన్స్ ప్లస్’ అనే షోకి ఒక జడ్జి గా వ్యవహరించింది, ఆ తర్వాత అదే ఓంకార్ 2022 వ సంవత్సరం లో ఆహా మీడియా యాప్ లో నిర్వహించిన ‘డ్యాన్స్ ఐకాన్’ లో ఈమె మెంటర్ గా వ్యవహరించింది. ఇక ఆ తర్వాత కనిపించలేదు. చూసేందుకు ఎంతో అందంగా ఉండే ఈ అమ్మాయికి హీరోయిన్ అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అని ఆమె అభిమానులకు అనిపించేది. కానీ తెలుగు లో ఆమెకి అవకాశాలు రాకపోయి ఉండొచ్చు కానీ, గుజరాతీ లో మాత్రం ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అక్కడ ఏడాదికి ఈమె రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. గత ఏడాది ఈమె హీరోయిన్ గా నటించిన ‘వార్ తహివార్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది కూడా, బిగ్ బాస్ లో ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది.