Homeఎంటర్టైన్మెంట్Mirai Movie Twitter Talk: 'మిరాయ్' ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా?...

Mirai Movie Twitter Talk: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?

Mirai Movie Twitter Talk: తేజ సజ్జ(Teja Sajja) నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలైంది. నిన్న కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్స్ లో ప్రీమియర్ షో ని ప్రదర్శించారు. నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ కూడా రెగ్యులర్ సినిమాలకంటే ముందే ప్రారంభించారు. మరి ఓవరాల్ గా ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ట్విట్టర్ లో వచ్చిన టాక్ ప్రకారం అయితే ఈ […]

Mirai Movie Twitter Talk: తేజ సజ్జ(Teja Sajja) నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలైంది. నిన్న కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్స్ లో ప్రీమియర్ షో ని ప్రదర్శించారు. నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ కూడా రెగ్యులర్ సినిమాలకంటే ముందే ప్రారంభించారు. మరి ఓవరాల్ గా ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ట్విట్టర్ లో వచ్చిన టాక్ ప్రకారం అయితే ఈ సినిమా సూపర్ హిట్ అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ గా ఉందనీ, మధ్యలో కొన్ని చోట్ల డ్రాప్స్ వచ్చినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశం వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కే మనం కొన్న టికెట్ రేట్ కి న్యాయం జరుగుతుందని అంటున్నారు.

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ప్రారంభం లో చాలా స్లో స్క్రీన్ ప్లే తోనే మొదలు అవుతుంది కానీ, కొన్ని అద్భుతమైన సన్నివేశాలు మరియు బలమైన క్లైమాక్స్ ఈ సినేమానికి నిలబెట్టేసిందని అంటూన్నారు. ఓవరాల్ గా సినిమాలో అక్కడక్కడా న్యారేషన్ లో లోపాలు ఉన్నప్పటికీ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా స్క్రీన్ ప్లే ని నడిపించాడని అంటున్నారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ వెన్నుముక లాగా నిల్చింది అనుకోవచ్చు. విజువల్స్ వెండితెర పై అదిరిపోయాయి, దానికి తోడు గౌరా హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కలిసిరావడంతో చూసే ఆడియన్స్ కి థియేట్రికల్ అనుభూతి వేరే లెవెల్ లో అనిపించిందని అంటున్నారు. ఇక నటీనటుల విషయానికి వస్తే, తేజ సజ్జ అద్భుతంగా నటించాడని, మంచు మనోజ్ కి కూడా చాలా బలమైన క్యారక్టర్ పడిందని, శ్రియ శరన్ కి కూడా చాలా కాలం తర్వాత ఒక బలమైన క్యారక్టర్ తగిలిందని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రభాస్ వాయిస్ ఓవర్ తోనే మొదలు అవుతుంది. అలాగే కొన్ని షాట్స్ లో శ్రీరాముడి విజువల్స్ ని చూపిస్తారు. ఆ విజువల్స్ లో మనం ప్రభాస్ కళ్ళని గమనించొచ్చు. ఇది ఆయన అభిమానులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి గా పరిగణించొచ్చు. నిన్న రాత్రి వరకు ఈ సినిమాలో ప్రభాస్ ప్రెజెన్స్ ఉంటుందని ఎవ్వరికి తెలీదు. తేజ సజ్జ మిరాయ్ గురించి ట్వీట్ వేస్తూ, ప్రభాస్ కి కృతఙ్ఞతలు చెప్తూ, రెబలియస్ సర్ప్రైజ్ అని అంటాడు. ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం షాక్. టికెట్ సేల్స్ కూడా భారీగా పెరిగాయి. సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేసే రేంజ్ పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper