Bigg Boss 9 Telugu Sanjana: ఈ సీజన్(Bigg Boss 9 Telugu) బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది అంటే అందుకు ముఖ్య కారణం సంజన అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది అనే వార్త వచ్చిన కొత్తల్లో, ఈమె ఎందుకు అవసరమా?, అందరికంటే వయస్సు లో పెద్ద, టాస్కులు కూడా పెద్దగా ఆడదేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆమె తన మొదటి ఎపిసోడ్ నుండే బలమైన మార్కు ని వేసుకుంది. ఫన్నీ గా ఉండాల్సిన చోట ఫన్నీ గానే ఉంటుంది, ఎత్తులు వేయాల్సిన చోట ఎత్తులు వేస్తుంది, ఏడిపించాల్సిన చోట ఏడిపిస్తుంది, తన బుర్రకి ఏది తోచితే అది చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ సీజన్ మొదలైన నాలుగు రోజులు కంటెంట్ మొత్తం ఇచ్చింది సంజన మాత్రమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో రాజమౌళి సినిమా లో హీరోకి ఎలాంటి ఎలివేషన్ దొరుకుతుందో, అలాంటి ఎలివేషన్ సంజన కి దొరికింది.
Also Read: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?
పూర్తి బ్యాక్ స్టోరీ ఒకసారి చూస్తే, మొన్న ఆమె హౌస్ లో గుడ్డు ని దొంగతనం చేయడం, ఆ తర్వాత అందరినీ ఇరికించి హౌస్ లోని కంటెస్టెంట్స్ మొత్తం గొడవ పడేలా చేయడం తో ఓనర్స్ ఒక నిర్ణయానికి వచ్చి సంజన ఎట్టి పరిస్థితిలోనూ రెండు రోజుల వరకు హౌస్ లోపలకు అడుగుపెట్టేందుకు వీలు లేదని అంటారు. ఈ సంఘటన జరిగిన కాసేపటికి ఆమెని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. అక్కడ ఆమెని బిగ్ బాస్ తిడుతారేమో అని అనుకుంటే, ఆమెని పొగడ్తల వర్షంలో ముంచి ఎత్తుతాడు. ఈ హౌస్ లోని కంటెస్టెంట్స్ ఇంకా ముఖానికి మాస్కులు వేసుకొనే తిరుగుతున్నారు, మీరొక్కటే ముఖానికి ఎలాంటి మాస్కు లేకుండా గేమ్ ని ఆడుతున్నారు, ఇంత అద్భుతంగా ఆడుతున్నందుకు మీకు ఒక పవర్ ఇస్తున్నాను, 5 మందిని కెప్టెన్సీ కంటెండర్ టాస్కు ని ఆడేందుకు మీరే ఎంపిక చెయ్యాలి అని అంటాడు.
ఏ కంటెస్టెంట్ ని అయితే ఓనర్స్ లోపలకు వచ్చేందుకు వీలు లేదని అంటారో, వాళ్లనే ఇప్పుడు సంజన దయ మీద కెప్టెన్సీ కంటెండర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కేవలం సినిమాల్లో మాత్రమే చూసే అరుదైన ఘటన ఇది. అంతే కాదు ఈమె కోసం టాస్కు ఆడేది కూడా ఓనర్ గ్రూప్ కి చెందిన శ్రీజా, ఆమె గెలిచి సంజన ని హౌస్ కి మొట్టమొదటి కెప్టెన్ కి కూడా చేస్తుంది. సాయంత్రం ఇమ్మానుయేల్ సరదాగా ఒక డైలాగ్ అంటాడు. మేడం మీరు టెనెంట్ గా ఉంటేనే ఈ రేంజ్ లో ఆడిస్తున్నారంటే, ఇక పొరపాటున ఓనర్ అయితే పరిస్థితి ఏంటి అని అంటాడు. ఇమ్మానుయేల్ భవిష్యత్తు ఊహించి అన్నాడో ఏమో తెలియదు కానీ,ఆయన అన్న దానికంటే పెద్ద స్థానం కి వెళ్లి కూర్చుంది సంజన. ఇప్పుడు ఆమె ఇంటికి కెప్టెన్ అయ్యింది, వచ్చే వారం మొత్తం కంటెంట్ కి తిరుగే ఉండదు అనుకోవచ్చు.