Today 12 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో వీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఇంటి నిర్మాణానికి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల చదువుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు పలుస్తాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కొన్ని వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే సంయమనుతో పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. ఇక్కడ మౌనంగా ఉండటమే మంచిది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. దీంతో మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు. అయితే ఒక్కో పనిని ఓపికతో పూర్తిచేయాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఊహించే దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు లాభాలు పొందే ఎందుకు కష్టపడాల్సి వస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిభను ప్రదర్శించే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఇతరుల నుంచి వచ్చే ఆదాయం పశువులవుతుంది. సాయంత్రం శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించడం ఖాయం.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వరకు కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. పాత స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు. అయితే అనవసరపు ఖర్చులు ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే వీరు ఈరోజు శుభవార్తలు వింటారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు తోడవుతారు. కుటుంబ సభ్యులతో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : మీ రాశి వారు ఈరోజు పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వెంటనే ఆందోళన చెందకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడవచ్చు. అయినా కూడా సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దుబార ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారికి ఈరోజు అన్ని విజయాలే సంక్రమిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులు ఈరోజు తీసుకుని నిర్ణయంతో భవిష్యత్తులో లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వీరి నైపుణ్యం ఆధారంగా ఆదాయం పెరుగుతుంది. కొందరికి బదిలీలు కూడా ఉండే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు వస్తువులు అవుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి గురువుల మద్దతు పొందుతారు. వ్యాపారులు లాభాలు పొందడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఏ రాశి వారు గతంలో చేపట్టిన పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. వ్యాపారం గురించి దూర పర్యటనలు చేయాల్సి వస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లయితే వెంటనే చెల్లించడం మంచిది. లేకుంటే అప్పుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.