Homeఎంటర్టైన్మెంట్Ram Charan twins viral photos: రామ్ చరణ్ కవలపిల్లలతో మెగాస్టార్ చిరంజీవి..వైరల్ అవుతున్న ఫోటోలు!

Ram Charan twins viral photos: రామ్ చరణ్ కవలపిల్లలతో మెగాస్టార్ చిరంజీవి..వైరల్ అవుతున్న ఫోటోలు!

Ram Charan twins viral photos: రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana Konidela) దంపతులు రీసెంట్ గానే తమ కవల పిల్లల బారసాల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాలకు సంబంధించిన వారంతా ఈ వేడుక లో పాల్గొనగా, అందుకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో చిరంజీవి చేతిలో ఒక బిడ్డ, అదే విధంగా ఉపాసన తల్లి చేతిలో మరో బిడ్డ ని మనం చూడొచ్చు. అబ్బాయికి శివ రామ్ కొణిదెల, అమ్మాయికి అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరైన ‘శివ శంకర వరప్రసాద్’ లోని ‘శివ’, రామ్ చరణ్ పేరు లోని ‘రామ్’ లను తీసుకొని ‘శివ రామ్’ అని అబ్బాయికి నామకరణం చేయగా, కూతురికి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేశారు. ‘అన్వీరా దేవి’ పేరు కి అర్థం కూడా చెప్పారు.

సాక్షాత్తు కనకదుర్గమ్మ ఆశీస్సులతో భయం లేని తత్వాన్ని, దైవిక రక్షణను సూచించేలా అన్వీరా దేవి అనే పేరు పెట్టినట్టు పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిన్నారులకు మీ అందరి దీవెనలు అందాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నాడు. ఈ ఫోటో రామ్ చరణ్ వడిలో కూర్చున్న క్లిన్ కారా ని కూడా మనం చూడొచ్చు. ఎప్పటి లాగానే, ఈసారి కూడా ఆమె ఫోటో ని బ్లర్ చేశారు. కానీ క్లిన్ కారా ని మొన్న ఉపాసన కి డెలివరీ సమయంలో రామ్ చరణ్ హాస్పిటల్ కి తీసుకొస్తుండగా ఆమె ముఖం పూర్తిగా బయటపడింది. చూసేందుకు ఈమె అచ్చం తన అమ్మ పోలికలతో ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. మా అమ్మాయి స్వేచ్ఛగా, ఎలాంటి హద్దులు లేకుండా సాధారణంగా పెరగాలి, అందుకే మా అమ్మాయి ఫోటోని బహిర్గతం చెయ్యాలని అనుకోవడం లేదు అంటూ రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు పుట్టిన కవలపిల్లల ఫోటోలను కూడా భవిష్యత్తులో బహిర్గతం చేసే అవకాశమే లేదని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆయన పెద్ది మూవీ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఏప్రిల్ 30 టార్గెట్ గా ఈ శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. మరో పక్క AR రెహమాన్ కూడా రీ రికార్డింగ్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఫస్ట్ హాఫ్ కి సంబంధించి ఎడిటింగ్ తో సహా మొత్తం లాక్ అయ్యి చాలా రోజులే అయ్యింది. ఈ నెల 18 లోపు ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ ని పూర్తి చేస్తారని తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Oktelugu Epaper