spot_img
Homeఎంటర్టైన్మెంట్Godse Movie: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ కానున్న... గాడ్సే మూవీ టీజర్

Godse Movie: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ కానున్న… గాడ్సే మూవీ టీజర్

Godse Movie: యంగ్ హీరో స‌త్య‌దేవ్ హీరోగా వ‌స్తున్న సినిమా గాడ్సే. జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఈ టాలెంటెడ్ యంగ్ హీరో. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడిన ప్రేక్షకుల్లో హీరోగా అంత గుర్తింపు పొందలేదు. వైవిధ్యమైన కథలతో, విలక్షణమైన పాత్రలు మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య , తిమ్మరుసుతో చిత్రంతో హిట్ అందుకోని విజయ బాటలో దూసుకెళ్తున్నారు సత్యదేవ్. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం సిద్ధం అవుతుంది.

megastar chiranjeevi going to launch godse movie teaser

ఈ మేరకు ఈరోజు మ‌ధ్యాహ్నం 12:01 గంట‌ల‌కు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజ‌ర్ ను విడుదల చేయ‌నున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్ ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కాగ గాడ్సే సినిమాను గోపి గ‌ణేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. అలాగే సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి మొద‌టి సారి తెలుగు లో హీరోయిన్ గా న‌టిస్తుంది. అలాగే నాస‌ర్, సాయాజీ షిండే, కిషోర్, బ్ర‌హ్మ‌జీ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే ప్రారంభం అయింది. కానీ కరోనా వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. కాగ ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అలానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ్ సేతు’ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version