Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తూ… కుర్ర హీరోలకు పోటీగా మారారు చిరంజీవి. చిరు ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. దీంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో మెగా స్టార్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా… రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే.. చాలా రోజుల తర్వాత ఆచార్య ప్రేక్షకులకు న్యూఇయర్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఆచార్య సినిమా నుంచి కీలక అప్డేట్ రివీల్ చేసింది చిత్రయూనిట్. ఆచార్య సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. సానా కష్టం అంటూ సాగే ఈ పాటను జనవరి 3న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ పాటలో చిరు స్టెప్పేస్తున్న పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
Let's begin 2022 with the High Voltage Party Song 💥💥#SaanaKastam Lyrical Video out on 3rd JAN at 4:05 PM#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @KonidelaPro @adityamusic pic.twitter.com/u1EILCzmda
— Matinee Entertainment (@MatineeEnt) December 31, 2021
శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే… మరో వైపు చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే దర్శకుడు బాబీ డైరెక్షన్ లో చిరు 154 ప్రకటించారు. వైజాగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కుతుంది. తాజాగా ఛలో, భీష్మ చిత్రాలతో హిట్స్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీకి చిరంజీవి సైన్ చేశారు.