https://oktelugu.com/

BigBoss 5: షణ్ముఖ్​, సిరి రిలేషన్​పై క్లారిటీ ఇచ్చిన సన్ని

BigBoss 5: ఎట్టకేలకు బిగ్​బాస్​ సీజన్​5 నన్నటితో పూర్తయింది. ఇన్నిరోజులు ఇంటిసభ్యుల మీద జరిగిన హోరాహోరీ పోరులో అందర్నీ తట్టుకుని నిలబడి ప్రేక్షకుల మన్ననలను దక్కించుకుని.. విజేతగా నిలిచాడు సన్ని. మొదటి నుంచి తన కోపంతో కాస్త నెగిటివిటీ సంపాదించినా.. ఆ తర్వాత హౌస్​మేట్స్​తో పాటు ప్రేక్షకుల మనసును గెలుచుకుని.. ఇప్పుడు టైటిల్​ విన్నర్​గా నిలిచాడు. ఈ టైటిల్ అందుకున్న సందర్భంగా ఎమోషనల్​ అవుతూ మాట్లాడారు సన్ని. ఈ క్రమంలోనే సిరి, షణ్ముక్ రిలేషన్ గురించి పలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 08:55 AM IST
    Follow us on

    BigBoss 5: ఎట్టకేలకు బిగ్​బాస్​ సీజన్​5 నన్నటితో పూర్తయింది. ఇన్నిరోజులు ఇంటిసభ్యుల మీద జరిగిన హోరాహోరీ పోరులో అందర్నీ తట్టుకుని నిలబడి ప్రేక్షకుల మన్ననలను దక్కించుకుని.. విజేతగా నిలిచాడు సన్ని. మొదటి నుంచి తన కోపంతో కాస్త నెగిటివిటీ సంపాదించినా.. ఆ తర్వాత హౌస్​మేట్స్​తో పాటు ప్రేక్షకుల మనసును గెలుచుకుని.. ఇప్పుడు టైటిల్​ విన్నర్​గా నిలిచాడు. ఈ టైటిల్ అందుకున్న సందర్భంగా ఎమోషనల్​ అవుతూ మాట్లాడారు సన్ని. ఈ క్రమంలోనే సిరి, షణ్ముక్ రిలేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    మొదటి నుంచి వీరిద్దరి రిలేషన్​ మీద అందరికీ డౌట్​గా ఉండేది.. అందరికీ స్నేహితులుగా చెప్తూనే.. ప్రేమాయణం నడిపిస్తున్నారేమో అని టీవీల్లో చూసే ప్రేక్షకులు కూడా అనుకున్నారు. అయితే, ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు సన్ని. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను గెలిపించినందుకు 19 మంది కంటెస్టెంట్లకు, ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు సన్ని. హౌస్​లో ఎంత కొట్టుకున్నా.. మర్నాడే కలిసిపోవడం బహుశా ఈ సీజన్​లోనే జరిగిందనుకుంటా.. అని చెప్పుకొచ్చాడు.

    తను ఈ స్థానంలో నిలబడటానికి ప్రేక్షకులు, స్నేహితులతో పాటు… నాగార్జున మోటివేషన్​ కూడా కారణమని.. అందుకు ధన్యవాదాలు తెలిపాడు సన్ని.  ఆ తర్వాత షణ్ముఖ్ గురించి ఓ క్లారిటీ ఇస్తాను సర్​.. ఈ విషయాన్ని ఇక్కడే మాట్లాడాలి. షణ్ముఖ్​, సిరి అలాంటి మంచి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం. నాకు, మానస్​కి ఎలాంటి స్నేహమైతే ఉండేదో.. అంతే ప్యూర్​ రిలేషన్ వాళ్లిద్దరి మధ్య చూశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మాటతో షణ్ముఖ్​ సన్నీకి ప్రేమతో హగ్​ ఇచ్చాడు.