https://oktelugu.com/

Godse Movie: హీరో సత్యదేవ్ “గాడ్సే” సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్

Godse Movie: జ్యోతిలక్ష్మి సినిమా తో హీరోగా పరిచయం అయ్యారు టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడిన ప్రేక్షకుల్లో హీరోగా అంత గుర్తింపు పొందలేదు. వైవిధ్యమైన కథలతో, విలక్షణమైన పాత్రలు మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య , తిమ్మరుసుతో చిత్రం తో హిట్ అందుకోని విజయ బాటలో దూసుకెళ్తున్నారు యంగ్ హీరో సత్యదేవ్. తాజాగా గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ కి జోడీగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 03:19 PM IST
    Follow us on

    Godse Movie: జ్యోతిలక్ష్మి సినిమా తో హీరోగా పరిచయం అయ్యారు టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడిన ప్రేక్షకుల్లో హీరోగా అంత గుర్తింపు పొందలేదు. వైవిధ్యమైన కథలతో, విలక్షణమైన పాత్రలు మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య , తిమ్మరుసుతో చిత్రం తో హిట్ అందుకోని విజయ బాటలో దూసుకెళ్తున్నారు యంగ్ హీరో సత్యదేవ్.


    తాజాగా గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ కి జోడీగా మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి నటిస్తోన్న చిత్రం “గాడ్సే”. ఇంటెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించనుంది. సి.కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న “గాడ్సే” చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది.అయితే ఈ సినిమా టీజర్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెలుపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చూడు మరి ఈ చిత్రం సత్యదేవ్ నుంచి ఏ రేంజ్ కు తీసుకు వెళ్ళను ఉందో అనేది అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

    పస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం, స్కైలాబ్, గాడ్ ఫాదర్, వంటి చిత్రాల్లో బిజీగా ఉన్నరు.అలానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ్ సేతు’ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో గుర్తుందా శీతాకాలం విడుదలకు సిద్ధంగా ఉంది.