https://oktelugu.com/

Bangarraju: అక్కినేని వారసులతో కలిసి మాస్​ స్టెప్పులేసిన చిట్టి.. ‘బంగార్రాజు’ ఐటెం సాంగ్​ రిలీజ్​

Bangarraju: టాలీవుడ్ కింగ్​ అక్కినేని నాగార్జున మరోసారి సోగ్గాడిగా కనిపించేందుకు ముస్తాబవుతున్నారు. ఈ సారి కొడుకును కూడా రంగంలోకి దింపేస్తున్నాడు.  నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న తాజా సినిమా బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి చేసుకుంది. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్​హిట్​గా నిలవడంతో.. మరోసారి అదే గెటప్​లో అలరించేందుకు సిద్ధమయ్యారు కింగ్​. రమ్యకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 08:35 AM IST
    Follow us on

    Bangarraju: టాలీవుడ్ కింగ్​ అక్కినేని నాగార్జున మరోసారి సోగ్గాడిగా కనిపించేందుకు ముస్తాబవుతున్నారు. ఈ సారి కొడుకును కూడా రంగంలోకి దింపేస్తున్నాడు.  నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న తాజా సినిమా బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి చేసుకుంది. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్​హిట్​గా నిలవడంతో.. మరోసారి అదే గెటప్​లో అలరించేందుకు సిద్ధమయ్యారు కింగ్​.

    రమ్యకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం అందుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే జోరుతో అందుకు సీక్వెల్​గా తెరకెక్కుతోన్న సినిమా బంగార్రాజు. ఇందులో నాగార్జున జోడీగా రమ్యకృష్ణ, చెతన్య సరసన కృతిశెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్​లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా, ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లిరికల్​ వీడియోను విడుదల చేశారు మేకర్స్​.

    ఇందులో జాతిరత్నాలు హీరోయిన్​ ఫరియా అబ్దుల్లా అక్కినేని వారసులతో కలిసి చిందేసింది. వాసివాడి తస్సాదియ్యా .. పిల్ల జోరు అదిరిందయ్యా అంటూ సాగే ఈ పాటలో నాగ్​,చైలతో చిట్టి మాస్​ స్టెప్పులేయించింది. అనూప్​ ఈ సినిమాకు రూబెన్స్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.  మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్ధన్ ఈ పాటను ఆలపించగా.. దర్శకుడు కళ్యాణ్​ కృష్ణ సాంగ్​ను రచించారు.  శేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులతో ఈ పార్టీ సాంగ్ అదిరిపోయింది. దానికి తోడు మధ్యలో రమ్యకృష్ణ కూడా కనిపించడంతో సాంగ్​కు మరింత అందం చేకూరింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది.