https://oktelugu.com/

Godse: సత్యదేవ్ “గాడ్సే” సినిమా టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి…

Godse: యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. నాజర్, సాయాజీ షిండే, కిషోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, నాగబాబు, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 01:15 PM IST
    Follow us on

    Godse: యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. నాజర్, సాయాజీ షిండే, కిషోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, నాగబాబు, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ చిరు హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కళ్యాణ్ లను అభినందించారు.

    ఇక ఈ టీజర్ విషయానికొస్తే… 1.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ ‘గాడ్సే’ పాత్రలో నటిస్తున్న సత్య దేవ్ అవినీతి రాజకీయాలను అరికట్టాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా చూపిస్తుంది. ఆయన కోసం అధికారులు గాలిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి విచారణ అధికారి కన్పించింది. ఇక టీజర్ లో “ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు…” అంటూ టీజర్ స్టార్ట్ కాగా “సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి… కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నారా? ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు” అంటూ సత్యదేవ్ ఆవేశంగా ప్రశ్నించడం ఆలోచింపజేస్తుంది. టీజర్లో సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇటీవల తిమ్మరుసు చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు సత్యదేవ్. మరి ఈ సినిమా ఏ రిజల్ట్ ఇస్తుందో చూడాలి.