Homeఎంటర్టైన్మెంట్Mangli Microfinance Case: అసలు సూత్రధారి మంగ్లీ నేనా… మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ఇన్ని...

Mangli Microfinance Case: అసలు సూత్రధారి మంగ్లీ నేనా… మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ఇన్ని కోట్లా..

Mangli Microfinance Case: వాళ్ళని చూస్తే జాలి వేస్తోంది. వారంతా కూడా పేదలు. అటువంటి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ పేదలకు అండగా నేనుంటాను. వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను. నేను ముందు వరుసలో ఉంటాను.. ఇటీవల సింగర్ మంగ్లీ విలేకరుల ఎదుట మాట్లాడిన మాటలు ఇవి. ఆమె మాట్లాడిన మాటలకు.. క్షేత్రస్థాయిలో జరిగిన సంఘటనలకు పొంతనలేదని తెలుస్తోంది. ఎందుకంటే […]

Mangli Microfinance Case: వాళ్ళని చూస్తే జాలి వేస్తోంది. వారంతా కూడా పేదలు. అటువంటి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ పేదలకు అండగా నేనుంటాను. వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను. నేను ముందు వరుసలో ఉంటాను.. ఇటీవల సింగర్ మంగ్లీ విలేకరుల ఎదుట మాట్లాడిన మాటలు ఇవి.

ఆమె మాట్లాడిన మాటలకు.. క్షేత్రస్థాయిలో జరిగిన సంఘటనలకు పొంతనలేదని తెలుస్తోంది. ఎందుకంటే మంగ్లీ అభియోగాలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ కేసులో తెలంగాణ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు మొత్తం మంగ్లీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి.. ఈ కేసులో తన తమ్ముడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని మంగ్లీ వాపోయారు. అయితే అతనికి సంబంధించి ఖాతాకు భారీగా నగదు బదిలీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అదే కాదు నగదు బదిలీ జరిగిన కొద్దిసేపటికి అతడు.. మొత్తం విత్ డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు.. ఈ కేసులో తెలంగాణ పోలీసులు మంగ్లీ సోదరుడి బ్యాంకు ఖాతా వివరాలు కావాలని కోరారు.. దానికి వారు పూర్తి వివరాలు ఇవ్వడంతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మంగ్లీ సోదరుడి ఖాతాలతో పాటు.. మంగ్లీ ఖాతాలు కూడా పోలీసులు పరిశీలించే అవకాశం కనిపిస్తోంది.

మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయకులను గిరిజనుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ డబ్బులతో వారు ఏం చేశారు.. ఇందులో ఎవరి పాత్ర ఏ స్థాయిలో ఉంది.. మీరు మాత్రమేనా.. ఇంకా ఎవరైనా ఇందులో ఉన్నారా.. అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ కేసులో మంగ్లీ సోదరుడికి సంబంధించిన ఖాతా వివరాలు తెలిసాయి కాబట్టి.. ఈ కేసులో సాధ్యమైనంత వరకు పోలీసులు అంచనా వేసిన పురోగతి లభించినట్టే .. అయితే ఆ తదుపరి పోలీసులు ఏం చేస్తారు.. ఈ కేసును ఇంకా ఏ స్థాయిలో దర్యాప్తు చేస్తారు.. ఒకవేళ మంగ్లీ పాత్ర ఉన్నట్టు తెలిస్తే.. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాలపై మరి కొద్ది రోజులలో క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గతంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఆగడాలు సృష్టించాయి. అమాయకులైన ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాయి. అయితే ఆ తర్వాత మైక్రోఫైనాన్స్ సంస్థల ఆగడాలకు అప్పటి ప్రభుత్వాలు చెక్ పెట్టాయి.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మైక్రో ఫైనాన్స్ వ్యవహారాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు మంగ్లీ సోదరుడి దందా వెలుగులోకి రావడంతో.. అసలు ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థకు ఎటువంటి అనుమతులు ఉన్నాయి? వాటి ద్వారా ఏ స్థాయిలో డబ్బులు వసూలు చేశారు.. ఆ డబ్బులను ఎటువైపు మళ్ళించారు.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి పోలీసులు కొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper