Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh: 'స్లమ్ డాగ్' చిత్రంతో పూరి, ఛార్మి భవిష్యత్తు ఏంటో తేలిపోనుందా?

Puri Jagannadh: ‘స్లమ్ డాగ్’ చిత్రంతో పూరి, ఛార్మి భవిష్యత్తు ఏంటో తేలిపోనుందా?

Puri Jagannadh: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం పూరి జగన్నాథ్(Puri Jagannath). సాధారణమైన హీరోలను బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని చేసిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకు ఒకే మూసలో వెళ్తున్న తెలుగు సినిమా పరిశ్రమ హీరోయిజం ఫార్మటు ని మార్చి హీరోయిజం ని ఇలా కూడా చూపించవచ్చా అని నిరూపించిన లెజండరీ డైరెక్టర్. ఒకప్పటి పూరి జగన్నాథ్ కం బ్యాక్ ఇస్తే, ప్రశాంత్ నీల్ , సందీప్ వంగ వంటి వాళ్ళు […]

Puri Jagannadh: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం పూరి జగన్నాథ్(Puri Jagannath). సాధారణమైన హీరోలను బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని చేసిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకు ఒకే మూసలో వెళ్తున్న తెలుగు సినిమా పరిశ్రమ హీరోయిజం ఫార్మటు ని మార్చి హీరోయిజం ని ఇలా కూడా చూపించవచ్చా అని నిరూపించిన లెజండరీ డైరెక్టర్. ఒకప్పటి పూరి జగన్నాథ్ కం బ్యాక్ ఇస్తే, ప్రశాంత్ నీల్ , సందీప్ వంగ వంటి వాళ్ళు అసలు పనికిరారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దురదృష్టం కొద్దీ పూరి జగన్నాథ్ కి గడిచిన దశాబ్ద కాలంలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక్కటే కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయిన సినిమా. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ముఖ్యంగా హీరోయిన్ ఛార్మి తో చేతులు కలపడం పూరి జగన్నాథ్ కి అసలు కలిసి రాలేదు.

ఆయన కెరీర్ మీ ఛార్మి తో కలవడానికి ముందు, కలిసిన తర్వాత అని విభజించవచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో మొట్టమొదటి సక్సెస్ ని జంటగా తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక పూరి – ఛార్మి టైం మొదలైంది, ఇక పెద్ద స్థాయి కి వెళ్ళిపోతారని అంతా అనుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత విజయ్ దేవరకొండ తో తీసిన ‘లైగర్ ‘ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. హిట్ అయ్యుంటే పూరి జగన్నాథ్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయేవాడు. నిర్మాతగా కూడా వందల కోట్లు సంపాదించేవాడు. కానీ బ్యాడ్ లక్ , ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత రామ్ పోతినేని తో చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కనీసం 10 కోట్ల రూపాయిల రేంజ్ లో కూడా షేర్ వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం.

ఇప్పుడు ఛార్మి – పూరి జంట తమిళ హీరో విజయ్ సేతుపతి తో చేసిన ‘స్లమ్ డాగ్’ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని నమ్మి ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు . కానీ ఎలాగో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. కానీ థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు. విజయ్ సేతుపతి వరుస హిట్స్ లో ఉన్నాడు , తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయినప్పటికీ కూడా బయ్యర్స్ లో పూరి – ఛార్మి కాంబినేషన్ పై నమ్మకం లేదు. సొంతంగా విడుదల చేసుకుంటే తప్ప గట్టు లెక్కలేని పరిస్థితి. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఈ జంట పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ హిట్ అయితే మాత్రం మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper