Homeఎంటర్టైన్మెంట్Mangli Controversy: మంగ్లీ ఆవేశంతో మాట్లాడింది గాని.. రాసిచ్చిన స్క్రిప్ట్ లో మీడియాపై వితండవాదమే ఎక్కువ

Mangli Controversy: మంగ్లీ ఆవేశంతో మాట్లాడింది గాని.. రాసిచ్చిన స్క్రిప్ట్ లో మీడియాపై వితండవాదమే ఎక్కువ

Mangli Controversy: శ్రీకాళహస్తిలో పాట షూట్.. బర్త్డే పార్టీలో మాదకద్రవ్యాలు.. బావిలోన పల్లి పలికే పాట లో ట్యూన్ కాపీ.. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు వివాదాలు. వివాదం ఆమె మొదలుపెడుతుంది.. ఆ తర్వాత మీడియా రాస్తే రుస రుసలాడుతూ ఉంటుంది. ఇదేంటని అడిగితే నాది మీడియా ఫ్యామిలీ రా బై అంటుంది.. చివరకు అన్ని చెక్ చేసుకొని రాయండి అంటుంది. మంగ్లీ అక్రమ వసూళ్లకు పాల్పడిందని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఆ కేసు పూర్తిగా […]

Mangli Controversy: శ్రీకాళహస్తిలో పాట షూట్.. బర్త్డే పార్టీలో మాదకద్రవ్యాలు.. బావిలోన పల్లి పలికే పాట లో ట్యూన్ కాపీ.. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు వివాదాలు. వివాదం ఆమె మొదలుపెడుతుంది.. ఆ తర్వాత మీడియా రాస్తే రుస రుసలాడుతూ ఉంటుంది. ఇదేంటని అడిగితే నాది మీడియా ఫ్యామిలీ రా బై అంటుంది.. చివరకు అన్ని చెక్ చేసుకొని రాయండి అంటుంది.

మంగ్లీ అక్రమ వసూళ్లకు పాల్పడిందని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఆ కేసు పూర్తిగా తప్పట.. పైగా దాని గురించి తెలుసుకున్న తర్వాత మీడియా రాయాలని నీతులు చెబుతోంది. ఇదంతా కూడా మీడియా చేసిన తప్పు అంటూ మొత్తం వద్దే ప్రయత్నం చేస్తోంది.

మంగ్లీ, ఆమె తమ్ముడు తనను చంపేస్తామని బెదిరించారని ఒక లాయర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో మంగ్లీ ఆ లాయర్ మీద ఉల్టా ఫిర్యాదు చేసింది. సో మొత్తానికి మరో కేసు నమోదు అయినట్టు.

ఈ రెండు కేసులను మీడియా ఒకే విధంగా చూసింది. మంగ్లీ మీద కోపంతో ఒక రకంగా.. ఆ లాయర్ మీద ప్రేమతో ఇంకొక రకంగా చేయలేదు. యూట్యూబ్ చానల్స్ గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఎందుకంటే అవి ఏ కేటగిరి కిందకూ రావు. ఇద్దరు కేసులు పెట్టుకున్నారు కాబట్టి.. నిజాలు మొత్తం తెలుసుకొని.. వివరాలు మొత్తం బయటపెట్టి.. ఇందులో దోషులెవరు.. వారి పాత్ర ఏమిటి అనే విషయాలను పోలీసులు బయటపెడతారు.. కానీ ఇక్కడ తనది మీడియా ఫ్యామిలీ అంటుంది మంగ్లీ. తను వి6 లో పని చేసింది. వాస్తవానికి తను ఒక ఆర్టిస్ట్.. జర్నలిస్ట్ కాదు.. వి6 తర్వాత యూట్యూబ్లోకి వెళ్లిపోయింది.. ఇప్పుడు సినిమాలోకి ప్రవేశించింది. అంటే ఆమెకు మీడియా, యూ ట్యూబ్, సినిమా కుటుంబాలు ఉన్నట్టు లెక్క.

ఇటీవల మంగ్లీ పాడిన కేడి ది డెవిల్ పాట గురించి విపరీతమైన చర్చ నడిచింది. ఆ రోత పాటను కూడా తను సమర్ధించుకుంది. మంగ్లీ లాంటి సెలబ్రిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సొసైటీ వాళ్లకు చాలా ఇచ్చింది. అలాంటప్పుడు సొసైటీ మీద వాళ్లకు కొంతలో కొంత బాధ్యత ఉండాలి. మీడియా మీద చిందులు తొక్కుతున్నది గాని.. మీడియాకు అలా చేసే ఆస్కారాన్ని తనే ఇస్తున్నది.. ఈ వసూళ్ల ఎపిసోడ్లో దర్శకుడు వేణు ఊడుగుల పేరు ప్రస్తావనకు వచ్చింది. అతడి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు. కానీ మీడియాలో తన పేరు రాశారని అతడు బాధపడుతున్నాడు. తను ఎవరినైనా బెదిరించాడా.. డబ్బులు వసూలు చేశాడా అనే విషయాలు ఇంతవరకు బయటకు రాలేదు..

మంగ్లీ, ఆ లాయర్ పరస్పరం విలేకరుల సమావేశాలు పెట్టుకున్నారు. ఎవరి కోణాలను వారు చెప్పుకున్నారు. ఇక్కడ మీడియా కూడా అదే ప్రజెంట్ చేస్తోంది. అలాంటప్పుడు మీడియాను మంగ్లీ నిందించడం ఏమిటో అర్థం కావడం లేదు. పైగా ఇక్కడ మంగ్లీ చెప్పిన మాట ఒకటి ఆశ్చర్యంగా అనిపించింది.

గత ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల డబ్బు ఇస్తామని చెప్పినప్పటికీ తాను ఎవరికి పాడలేదని.. ప్రచారం చేయలేదని మంగ్లీ తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంది. పైగా ఆ లాయర్ శ్రీముఖి మీద ఇష్టాన్ని పెంచుకున్నాడని.. ఫేమ్ కోసం ఇదంతా చేస్తున్నాడని.. బిగ్ బాస్ లోకి వెళ్లాలని అతడు అనుకుంటున్నాడని మంగ్లీ చెప్పింది. అడ్డగోలు పనులు చేసి.. ప్రచారాన్ని పెంచుకొని.. బిగ్ బాస్ లోకి వెళ్తారా.. ఈ ప్రశ్నకు మంగ్లీ అనే సమాధానం చెప్పాలి. ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత సెలబ్రిటీలను కూడా అతడు సతాయిస్తుంటాడని మంగ్లీ అన్నది. అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను 10 లక్షలు డిమాండ్ చేశాడని మంగ్లీనే సంచలన ఆరోపణ చేసింది. ఇవన్నీ చూస్తుంటే లింకు లేని మాటల్లాగా.. అడ్డగోలు స్క్రిప్ట్ లాగా అనిపిస్తున్నాయి.

ఇక్కడ మీడియాను పదేపదే ప్రశ్నిస్తున్న మంగ్లీ.. ఈ వ్యవహారంలో నా ప్రమేయం లేకపోతే సుబ్బారావు మీరు ఏం చేస్తారని ప్రశ్నిస్తోంది.. వాస్తవానికి మీడియా అనేది వార్తలను ప్రసారం చేస్తుంది. ప్రచురిస్తుంది. సొంత తీర్పులు ఇవ్వదు. అవి చేయడానికి కోర్టులు ఉన్నాయి. తప్పు చేసిన వారిని శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మీడియాలో పనిచేసిన మంగ్లీకి.. మీడియా బాధ్యత ఏమిటో తెలియదా.. ఏమో కాస్త సెలబ్రిటీ కాగానే ఏం చేస్తున్నారో.. ఎలాంటి విహారాలకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదు. అచ్చం మంగ్లీ మాదిరిగా.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper