HomeతెలంగాణMangli controversy latest news: తప్పు చేయలేనప్పుడు.. మంగ్లీ తప్పించుకోవడం ఎందుకు..

Mangli controversy latest news: తప్పు చేయలేనప్పుడు.. మంగ్లీ తప్పించుకోవడం ఎందుకు..

Mangli controversy latest news: వాళ్లంతా పేదలు. వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి. వారి తరఫున నేను పోరాడుతాను. అవసరమైతే హెల్ప్ చేస్తాను. ముందుగా వారిని పట్టుకోవాలి. ఈ కేసులో సంబంధం లేని వ్యక్తులపై విమర్శలు చేస్తున్నారు. నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. మీడియా నాకు అండగా ఉండాలి. నామీద అడ్డగోలుగా రాయవద్దు. నేను బాధపడుతున్నాను. ఇబ్బంది పడుతున్నాను.. ఇదిగో ఇలా సాగిపోయింది మంగ్లీ ఆ మధ్య రెండు […]

Mangli controversy latest news: వాళ్లంతా పేదలు. వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి. వారి తరఫున నేను పోరాడుతాను. అవసరమైతే హెల్ప్ చేస్తాను. ముందుగా వారిని పట్టుకోవాలి. ఈ కేసులో సంబంధం లేని వ్యక్తులపై విమర్శలు చేస్తున్నారు. నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. మీడియా నాకు అండగా ఉండాలి. నామీద అడ్డగోలుగా రాయవద్దు. నేను బాధపడుతున్నాను. ఇబ్బంది పడుతున్నాను.. ఇదిగో ఇలా సాగిపోయింది మంగ్లీ ఆ మధ్య రెండు సార్లు విలేకరులతో మాట్లాడినప్పుడు సాగించిన మాటల పరంపర.

ఆమె మాట్లాడిన మాటలకు.. క్షేత్రస్థాయిలో చేతులకు పొంతనలేదని పోలీసుల దర్యాప్తులో తేలిపోయింది. ఈ కేసులో ఇప్పటికి తెలంగాణ పోలీసులు అనేక రకాలుగా సమాచారాలను సేకరించినట్టు తెలుస్తోంది. మంగ్లీ సోదరుడి ఖాతాలోకి భారీగా జమైన డబ్బు.. ఆ డబ్బును డ్రా చేసిన తీరు.. ఇంకా అనేక అంశాలను గుర్తించారు. సాంకేతిక ఆధారాలు మాత్రమే కాకుండా.. ఇక అనేక రకాలైన కీలక ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత తదుపరి ఏం చేయాలనేది పోలీసులు నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఈ ఎపిసోడ్ ఇలా సాగుతుండగానే మంగ్లీ గురించి మరోసారి న్యాయవాది సుబ్బారావు సంచలన ఆరోపణలు చేశారు.. “మంగ్లీ మీద, ఆమె సోదరుడు శివ మీద గద్వాల, గచ్చిబౌలి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. దీనికి సంబంధించి వాళ్లు సమాధానం చెప్పాలి. మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో డిజిపి సివి ఆనంద్ ను కలిశాం. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తాను. బాధితులకు తిరిగి డబ్బులు చెల్లిస్తే ఖచ్చితంగా కేసులు వెనక్కి తీసుకుంటాం.. మైక్రో ఫైనాన్స్ స్కీం పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు , ఇంకా కొంతమంది కోట్లలో మోసం చేశారు. ఈ విషయాన్ని నాకు హిమ కాంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మంగ్లీని సంప్రదించాను. ఆమె నన్ను బెదిరించారు.. అందువల్లే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను.. నా ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు, మరో ముగ్గురు మీద కేసు నమోదు చేశారని” న్యాయవాది సుబ్బారావు తెలిపారు.

మరోవైపు సుబ్బారావు మీద కూడా మంగ్లీ ఫిర్యాదు చేశారు.. తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని.. ఓ సెలబ్రిటీ నటిమీద సుబ్బారావుకు క్రష్ ఉందని.. అందువల్లే ఇదంతా చేస్తున్నారని మంగ్లీ ఆరోపించారు. తన మీద ఫిర్యాదులు చేస్తూ సుబ్బారావు ప్రాచుర్యం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. కాగా, సుబ్బారావు బుధవారం కీలకమైన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తప్పు చేయనప్పుడు మంగ్లీ ఎందుకు తప్పించుకుంటున్నారని ఆరోపించారు.. సుబ్బారావు ఇన్ని రకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. మంగ్లీ ఏవిధంగా సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper