Krack Movie: క్రాక్ సినిమాలో వరలక్ష్మి పాత్రకి ముందుగా ఆ స్టార్ నటిని తీసుకోవాలనుకున్నారా..?

Krack Movie: ముఖ్యంగా రవితేజతో డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు చేసి తనలాంటి దర్శకుడు ఇండస్ట్రీ లో మరొకరు లేరు అనేంతలా గొప్ప గుర్తింపునైతే తెచ్చుకున్నాడు.

Written By: Gopi, Updated On : June 22, 2024 2:32 pm

Manchu Lakshmi first choice for Varalaxmi Sarathkumar Role in Krack movie

Follow us on

Krack Movie: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ హీరో అయిన సన్నీ డియోల్ తో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఇంతకుముందు తెలుగులో రవితేజ లాంటి స్టార్ హీరోతో మంచి సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ముఖ్యంగా రవితేజతో డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు చేసి తనలాంటి దర్శకుడు ఇండస్ట్రీ లో మరొకరు లేరు అనేంతలా గొప్ప గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన రవితేజతో చేసిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కి చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది. అలాగే ఈ సినిమా విజయంలో తను కూడా కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. అలాంటి ఒక జయమ్మ పాత్ర కోసం మొదట చాలామందిని చూశారట. ఇక ముందుగా ఈ సినిమాలో ఆ పాత్ర కోసం మంచు లక్ష్మిని తీసుకోవాలని అనుకున్నారట.

Also Read: Kalki Movie: కల్కి సినిమాకి సెన్సార్ కట్ చేసిన సీన్స్ వల్ల ఎంత నష్టం జరగబోతుందో తెలుసా..?

కానీ తర్వాత వాళ్ల నిర్ణయాన్ని మళ్లీ మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మంచు లక్ష్మి అయిన కూడా ఈ సినిమాలో చాలా బాగుండేది. కానీ ఆమె మీద కొంత వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం, చాలామంది కామేడి చేస్తూ వీడియోలు చేయడం వల్ల ఆమెను కాదని ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసుకున్నారట. ఇక అప్పటికే ఆమె పందెంకోడి 2 అనే సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Also Read: AR Murugadoss: 19 సంవత్సరాల తర్వాత ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రానుందా..?

ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మి ఒక మంచి క్యారెక్టర్ అయితే కోల్పోయిందనే చెప్పాలి. ఒకవేళ వరలక్ష్మి శరత్ కుమార్ కాకుండా మంచు లక్ష్మి కనక ఈ క్యారెక్టర్ చేసుంటే కూడా మంచి గుర్తింపు వచ్చి ఆమెకు పలు రకాల సినిమాల్లో అవకాశాలైతే వచ్చేవి…ఇక ఇది ఏమైనా వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం ఆ పాత్ర లో జీవించిందనే చెప్పాలి…