Music Day 2024: సంగీత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆరోజు ఏం చేస్తారు?

Music Day 2024: ఇప్పుడు మొబైల్ ద్వారా మ్యూజిక్ ద్వారా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ సంగీతం ఎక్కడ ప్రారంభమైంది? దీని చరిత్ర ఏంటి? సంగీత దినోత్సవాన్ని ఎప్పుుడు జరుపుకుంటారు? ఆ వివరాల్లోకి వెళితే..

Written By: Srinivas, Updated On : June 22, 2024 2:23 pm

World Music Day 2024

Follow us on

Music Day 2024: ‘సంగీతానికి చెట్లు కూడా స్పందిస్తాయి..’ అని అంటారు. మంచి సంగీతం వినడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. కొన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం రోజు కాసేపు నిర్మలమైన మ్యూజిక్ వినాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. నేటి కాలంలో వివిధ మార్గాల ద్వారా సంగీతం వింటున్నారు. ఒకప్పుడు రేడియోలో వచ్చే పాటలు విని సంతోషించారు. ఆ తరువాత టీవీలు చూసేవారు. ఇప్పుడు మొబైల్ ద్వారా మ్యూజిక్ ద్వారా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ సంగీతం ఎక్కడ ప్రారంభమైంది? దీని చరిత్ర ఏంటి? సంగీత దినోత్సవాన్ని ఎప్పుుడు జరుపుకుంటారు? ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతీ ఏడాది జూన్ 21న సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో ఈరోజున ప్రత్యేక ఈవెంట్లు చేస్తుంటారు. ప్రేక్షకులను సంతోష పెట్టడానికి వివిధ రకాల మ్యూజిక్ పరికరాల ద్వారా మంచి సంగీతాన్ని అందిస్తారు. ప్రతీరోజూ ఏదో ఒక పనితో బిజీగా ఉండేవాళ్లు కనీసం ఈరోజైన మంచి సంగీతాన్ని ఆస్వాదించి మనసును ఉల్లాస పరుచుకోవాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సంగీత దినోత్సవానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఇంతకీ సంగీతం ఎక్కడ ప్రారంభమైంది? దాని చరిత్ర ఏంటి?

సంగీతాన్ని ‘ఫేట్ డి లా మ్యూజిక్ ’ అని కూడా పిలుస్తారు. 1981లో ప్రాణ్స్ లో సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ రెడియోకు చెందిన వ్యక్తితో కలిసి సంగీతంనకు ఓ రోజు ఉండాలని ప్రతిపాదించాడు. 1982లో మొదటి ఫేట్ డి లా మ్యూజిక్ (సంగీత దినోత్సవాన్ని) ను నిర్వహించారు. ఈవేడుకలో భాగంగా ప్రాన్స్ నగరంలో 1000 మంది సంగీతకారులు ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జూన్ 21న సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

సంగీత దినోత్సవాన్ని నిర్వహించడానికి కారణం లేకపోలేదు. పనులన్నీ పక్కనబెట్టి ఈరోజు సాంప్రదాయం మ్యూజిక్ తో ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా ప్రాచీన సంగీతాన్ని కాపాడుకునేందుకు ఇదో మంచి వేదిక అని భావిస్తున్నారు. సంగీతం అంటే ఇష్టముండే ప్రతీ ఒక్కరు ఈ దినోత్సవం రోజు నిర్వహించే వేడుకలో పాల్గొనడం ద్వారా వారికి కావాల్సిన మ్యూజిక్ ను వినొచ్చు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులైన సంగీతకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే వీలుంది.