Kalki Movie: కల్కి సినిమాకి సెన్సార్ కట్ చేసిన సీన్స్ వల్ల ఎంత నష్టం జరగబోతుందో తెలుసా..?

Kalki Movie: రెండు సినిమాల ఎక్స్పీరియన్స్ తోనే 600 కోట్ల బడ్జెట్ తో సినిమాను డీల్ చేస్తున్నాడు అంటే నిజంగా నాగ్ అశ్విన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : June 22, 2024 2:18 pm

Do you know how much damage will be caused by the censor-cu scenes in Kalki Movie

Follow us on

Kalki Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండటం విశేషం… 600 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక రెండు సినిమాల ఎక్స్పీరియన్స్ తోనే 600 కోట్ల బడ్జెట్ తో సినిమాను డీల్ చేస్తున్నాడు అంటే నిజంగా నాగ్ అశ్విన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ఈ సినిమా మీద బిజినెస్ అయితే భారీ ఎత్తున జరిగింది. దానికి సంబంధించి వసూళ్లు కూడా భారీగానే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చాలా మందికి నచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాను ముంబైలో సెన్సార్ రిపోర్ట్ కోసం పంపించారట.

Also Read: Deepika Padukone: కల్కి సినిమా ట్రైలర్ లో దీపిక పదుకొనే పాత్రను చూస్తుంటే దేవసేన గుర్తుకు వస్తుంది… ఎందుకంటే..?

ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ కొన్ని సీన్స్ ని కట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సీన్స్ ను ఎందుకు కట్ చేశారంటే మన పురాణాలను బేస్ చేసుకొని చాలా ఓవర్ గా డైలాగులున్నాయట. దానివల్ల ఆ సీన్స్ ను కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరికొన్ని సీన్లు చాలా రక్తపాతం తో కూడుకొని ఉన్నాయట. అందువల్లే వాటిని కూడా కట్ చేసినట్టుగా తెలుస్తుంది.

Also Read: Kantara 2: కాంతార 2 డ్యూయల్ రోల్లో నటిస్తున్న రిషబ్ శెట్టి… ఆ పాత్రలు ఏంటంటే..?

అయితే ఈ కట్ చేసిన సీన్స్ ద్వారా సినిమా మొత్తానికి దాదాపు 20 కోట్ల వరకు నష్టం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆ సీన్స్ ని తెరకెక్కించడానికి దాదాపు 20 కోట్ల వరకు డబ్బులు ఖర్చు అయ్యాయట. ఇక మొత్తానికైతే ఈ సినిమా నుంచి ఒక 5 నుంచి 6 సీన్లను కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి…