AR Murugadoss: 19 సంవత్సరాల తర్వాత ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రానుందా..?

Tollywood: మురుగదాస్ మాత్రం డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే గజిని సినిమాను బాలీవుడ్ లో 'అమీర్ ఖాన్' తో చేసి మంచి సక్సెస్ ని సాధించాడు.

Written By: Gopi, Updated On : June 22, 2024 2:13 pm

AR Murugadoss planning to make Ghajini 2

Follow us on

AR Murugadoss: 2005 వ సంవత్సరంలో డైరెక్టర్ మురుగదాస్ సూర్య ని హీరోగా పెట్టి తీసిన ‘గజిని’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా తెలుగు తమిళం లో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా మురుగదాస్ కి చాలా మంచి క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన తెలుగులో చిరంజీవి లాంటి స్టార్ హీరో తో సైతం ‘స్టాలిన్’ అనే సినిమాని డైరెక్షన్ చేశాడు.

ఇక ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించనప్పటికీ మురుగదాస్ మాత్రం డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే గజిని సినిమాను బాలీవుడ్ లో ‘అమీర్ ఖాన్’ తో చేసి మంచి సక్సెస్ ని సాధించాడు.ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘గజిని 2’ చేయాలనే ఆలోచనలో మురుగదాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సీక్వెల్లో హీరోగా సూర్య నటిస్తాడా లేదంటే అమీర్ ఖాన్ నటిస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

Also Read: Star Heroes: ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టలేని ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..?

ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అయిన చేసి ఒక భారీ విక్టరీని సాధించాలని మురుగదాస్ చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా ఫైనలైజ్ చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇంతకు ముందు ఆయన సక్సెస్ లను ఇచ్చిన హీరోలే ఆయన ప్లాప్ ల్లో ఉన్నప్పుడు అవకాశం అడిగితే ఇవ్వలేదట.

Also Read: Deepika Padukone: కల్కి సినిమా ట్రైలర్ లో దీపిక పదుకొనే పాత్రను చూస్తుంటే దేవసేన గుర్తుకు వస్తుంది… ఎందుకంటే..?

ఎవరైతే తనకు డేట్స్ ఇవ్వలేదో ఇక ఫ్యూచర్ లో ఆ హీరోలతో తను సినిమాలు చేయదల్చుకోలేదట. ఇక ప్రస్తుతానికైతే సూర్యని హీరోగా పెట్టి గజిని 2 సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుత ఆయన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా కూడా చేయబోతున్నాడు. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ వస్తుందా లేదా అనేది…