Kiara Advani rejected Dhurandhar: సినీ ఇండస్ట్రీ లో మనుగడ సాగించాలంటే కచ్చితంగా లక్ అనే ఫ్యాక్టర్ చాలా కీలకం. లక్ లేకుండా ఎంత టాలెంట్ ఉన్నా వృధానే. పాపం అలా లక్ ఫ్యాక్టర్ కలిసిరాక ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీ లో ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని టీవీ లలో అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు చాలా బాధపడుతుంటాము. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ. ఈమె మన టాలీవుడ్ కి ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది, కియారా అద్వానీ కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా విజయాలు కూడా అందుకుంది. కానీ ఈమధ్య కాలం లో ఈమెకు సరైన హిట్ పడడం లేదు.
తెలుగు లో రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన ‘గేమ్ చేంజర్ ‘ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈమె హీరోయిన్ గా నటించిన ‘టాక్సిక్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ, ఇండియన్ సినిమాలో సరికొత్త చరిత్ర లిఖిస్తు ముందుకు దూసుకుపోతున్న ‘ధురంధర్’ సిరీస్ లో హీరోయిన్ పాత్రని మిస్ చేసుకుందట. ఈ పాత్ర కోసం ముందుగా కియారా అద్వానీ నే సంప్రదించారట. కానీ అప్పటికే ఆమె వేరే కమిట్మెంట్స్ తో బిజీ గా ఉండడం తో ఆమెకు బదులుగా సరా అర్జున్ ని తీసుకున్నారు. ఈ సినిమాలో సరా అర్జున్ కి ఎంత మంచి పేరొచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆమెకు పాన్ ఇండియా లెవెల్ లో అవకాశాలు కూడా భారీగానే వస్తున్నాయి.
ఒకవేళ కియారా అద్వానీ ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే కచ్చితంగా ఆమె కెరీర్ కి చాలా పెద్ద ఉపయోగపడేది, ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్ళేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న హీరోయిన్ కి ఈ చిత్రం ఇచ్చే బూస్ట్ మామూలు రేంజ్ లో ఉండేది కాదని, బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుంది అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. కనీసం ‘టాక్సిక్’ చిత్రం తో అయినా ఈమె కం బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.
