Keerthy Suresh: పాన్ ఇండియా లెవెల్ లో నటిగా మంచి గుర్తింపు పొంది, నేషనల్ అవార్డు ని సైతం అందుకున్న కీర్తి సురేష్(Keerthy Suresh) కి సౌత్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో తో సంబంధం లేకుండా కేవలం హీరోయిన్ ని చూసి థియేటర్స్ కి కదిలే ప్రేక్షకులు చాలా అరుదుగా ఉంటారు, అలాంటి హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈమధ్య కాలం లో ఈమెకు వరుసగా ఫ్లాప్ సినిమాలే వస్తున్నాయి. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన ‘రివాల్వర్ రీటా’ కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కనీసం విడుదలైంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు, ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఇదే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి కీర్తి సురేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఆంటోని నేను 15 ఏళ్ళ నుండి ప్రేమలో ఉన్నాం. మా ఇద్దరి పెళ్లి పెద్దల సమక్ష్యంలో అంత వైభవంగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. మేమిద్దరం కచ్చితంగా ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంటామని అనుకున్నాను. కానీ లక్కీ గా మా ఇంట్లో పెళ్ళికి అంగీకరించడం తో ఆ అవకాశం రాలేదు. ఈ పెళ్లి మా కల నిజమైనట్లుగా అనిపించింది. అందుకే మా వివాహ వేడుకలో నేను తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాను. ఒక్క క్షణం పాటు నా నోటి నుండి మాట రాలేదు. 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రేమాయణం 30 సెకండ్ల సమయం లో తాళి కట్టేటప్పుడు నా కళ్ల ముందు కనిపించింది. అందుకే ఆనందబాష్పవాలు ఆగలేదు. ఆంటోని పరిస్థితి కూడా అంతే, బాగా ఎమోషనల్ అయిపోయాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు చూసాను. ఇది నా జీవితం లో ఒక అందమైన ప్రయాణం’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.
కీర్తి సురేష్ మతపరంగా హిందూ, ఆంటోనీ క్రిస్టియన్. వీళ్లిద్దరి పెళ్లి రెండు మతాలకు సంబందించిన సంప్రదాయాలతో జరిగింది. హిస్టరీ లో ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి వివాహం చేసుకోలేదు. 2024 డిసెంబర్ 12 న హిందూ సంప్రదాయ పద్దతిలో వీళ్లిద్దరి పెళ్లి జరగగా, 15 న క్రైస్తవ పద్దతిలో వివాహం జరిగింది. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉన్నాయి. ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ జంటని కూడా చేర్చొచ్చు.