Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh fan interaction viral: మీ పువ్వు సూపర్ మేడం అంటూ అభిమాని కామెంట్స్..మండిపడ్డ...

Keerthy Suresh fan interaction viral: మీ పువ్వు సూపర్ మేడం అంటూ అభిమాని కామెంట్స్..మండిపడ్డ కీర్తి సురేష్..వీడియో వైరల్!

Keerthy Suresh fan interaction viral: సినీ సెలబ్రిటీలు పబ్లిక్ లోకి రావాలంటే భయపడే పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. అందరూ ఒక్కసారిగా వాళ్ళవైపు దూసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఒక తలకాయ నొప్పి చర్య అయితే, వాళ్ళు అడిగి కొన్ని ప్రశ్నలకు ఇదేమి కర్మరా బాబు అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితిలు ఎదురు అవుతున్నాయి. రీసెంట్ గా కీర్తి సురేష్(Keerthy Suresh) కి అలాంటి అనుభవమే ఎదురైంది. చెన్నై లో ఆమె తన ఇంటికి వెళ్తున్న సమయం లో […]

Keerthy Suresh fan interaction viral: సినీ సెలబ్రిటీలు పబ్లిక్ లోకి రావాలంటే భయపడే పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. అందరూ ఒక్కసారిగా వాళ్ళవైపు దూసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఒక తలకాయ నొప్పి చర్య అయితే, వాళ్ళు అడిగి కొన్ని ప్రశ్నలకు ఇదేమి కర్మరా బాబు అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితిలు ఎదురు అవుతున్నాయి. రీసెంట్ గా కీర్తి సురేష్(Keerthy Suresh) కి అలాంటి అనుభవమే ఎదురైంది. చెన్నై లో ఆమె తన ఇంటికి వెళ్తున్న సమయం లో కారు ఎక్కుతుండగా, ఒక అభిమాని ఆమెని పిలిచి ‘మీ పువ్వు చాలా బాగుంది మేడం’ అని అంటాడు. దీంతో కీర్తి సురేష్ ఒక్కసారిగా షాక్ కి గురై , ‘ఆ..?, పువ్వు బాగుందా?, ఏమి మాట్లాడుతున్నావ్’ అని అంటుంది. అంటే ఆమె నిజంగానే పువ్వు తలకి పెట్టుకుంది కానీ, అతను ఏ ఉద్దేశ్యం తో ఆ మాట అన్నాడో తెలియక కీర్తి సురేష్ షాక్ కి గురైంది.

ఆమె మాట్లాడుతూ ‘నా లుక్ చాలా బాగుంది అనాలి కానీ, పువ్వు బాగుండడం ఏంట్రా’ అంటూ కారు లోపలకు ఎక్కింది. అనంతరం ఆమె తమిళం లో ‘ఆ పాపి పువ్వు బాగుంది అంటున్నాడు ,ఏమి చెప్పాలి వాడికి’ అంటూ తిట్టుకోవడాన్ని మనం ఈ క్రింది వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో లో కీర్తి సురేష్ నుండి వివిద రకాల రియాక్షన్స్ ని చూడొచ్చు. నవ్వాలో, కోపం తెచ్చుకోవాలో అర్థం అవ్వని పరిస్థితిలో ఆమె రియాక్షన్ ఉన్నింది. ఇలాంటి వింతైన అనుభవాన్ని ఎదురుకున్న కీర్తి సురేష్ ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. గతం లో కూడా కీర్తి సురేష్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒక అభిమాని సెల్ఫీ అడగ్గా, ఇవ్వడానికి రెడీ అయ్యింది. అయితే ఆ అభిమాని ఫోన్ కెమెరా పైకి పెట్టడంతో తన జాకెట్ ని కవర్ చేసుకుంటూ, క్రిందకు దించి ఫోటో తీసుకోమని అభిమానితో అంటుంది. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.

ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, ఆంటోనీ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తోంది కీర్తి సురేష్. ఈమధ్య కాలం లో ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతోంది. ఆమె చివరి సూపర్ హిట్ చిత్రం ‘దసరా’ ఆ తర్వాత విడుదలైన భోళా శంకర్, సైరెన్, రఘు తాత, బేబీ జాన్, ఉప్పు కప్పురంబు, రివాల్వర్ రీటా వంటి చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈమె తెలుగు లో విజయ్ దేవరకొండ తో ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రం చేస్తోంది. వీటితో పాటు తమిళం లో ఒక సినిమా , మలయాళం లో మరో సినిమా చేస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper